Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వెంకయ్య చొరవ : గూడూరు - విజయవాడ మధ్య ఇంటర్ సిటీ రైలు

వెంకయ్య చొరవ : గూడూరు - విజయవాడ మధ్య ఇంటర్ సిటీ రైలు
, శుక్రవారం, 26 జులై 2019 (11:23 IST)
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మరోమారు చొరవ తీసుకున్నారు. ఈ కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రైలు పరుగులు తీయనుంది. గూడూరు - విజయవాడల మధ్య ఇంటర్ సిటీ రైలును నడిపేందుకు భారతీయ రైల్వే శాఖ సమ్మతించింది. ఫలితంగా గూడూరు నుంచి విజయవాడకు కేవలం నాలుగు గంటల్లో చేరుకునే అవకాశం ఉంది. ఈ రేలు నెల్లూరు, కావలి, ఒంగోలు, బాపట్ల, తెనాలి మధ్య ఆగనుంది. 
 
ప్రస్తుతం ఈ ప్రాంతాల మధ్య పలు రైళ్లు నడుసున్నాయి. అయితే, ఇవన్నీ సమయానుకూలంగా లేవన్న విమర్శలు వినొస్తున్నాయి. ఈ విషయాన్ని పలువురు రాజకీయ నేతలు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన రైల్వే శాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తి మేరకు విజయవాడ - గూడూరు మధ్య సరికొత్త ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌ను ప్రకటించారు. ఈ రైలు కేవలం 4.30 గంటల వ్యవధిలోనే గమ్యస్థానానికి చేరుకోనుంది. 
 
ఈ రైలు గూడూరు నుంచి ప్రతి రోజూ ఉదయం 6.10 గంటలకు బయలుదేరి నెల్లూరు, కావలి, సింగరాయకొండ, ఒంగోలు, చీరాల, బాపట్ల, తెనాలి మీదుగా ఉదయం 10.40కి విజయవాడకు చేరుతుంది. ఇదే రైలు విజయవాడ నుంచి (12744) సాయంత్రం 6 గంటలకు బయలుదేరి రాత్రి 10.30 గంటలకు గూడూరుకు చేరుతుంది. ఈ రైలు రేక్‌ని నిర్వహించే బాధ్యత విజయవాడ డివిజన్‌కు అప్పగించారు. ఈ రైలును ప్రారంభించేందుకు స్వయంగా వెంకయ్యనాయుడు వస్తారని తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేసీఆర్ చాలా మంచోడు.. చంద్రబాబు రాక్షసుడు : సీఎం జగన్