Publish Date: Mon, 22 Jul 2019 (10:37 IST)
Updated Date: Mon, 22 Jul 2019 (10:38 IST)
భోజనం పెట్టమంటే అన్నం వండలేదని చెప్పిందని చాకుతో భార్య కాళ్లు, చేతులు కోసేశాడు ఓ దుర్మార్గపు భర్త. ఈ ఘటన విజయవాడ చిట్టినగర్ ప్రాంతం గొల్లపాలెంగట్టులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కాలనీకి చెందిన అన్నపురెడ్డి జగదీష్‌రెడ్డి, హాసినికి ఏడేళ్ల క్రితం వివాహం అయ్యింది.
వీరికి ఇద్దరు పిల్లలు. ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న జగదీష్ సంపాదన అంతా సొంత ఖర్చుకే తగలేసుకుంటాడు. బలాదూర్‌గా తిరుగుతాడు. ఇంటి ఖర్చుకు డబ్బు ఇచ్చేవాడు కాదు. ఈ వ్యవహారంలో తరచూ దంపతుల మధ్య తరచూ గొడవ జరుగుతుండేది.
ఈ నేపథ్యంలో శనివారం అర్ధరాత్రి తర్వాత ఇంటికి వచ్చిన జగదీష్ భోజనం పెట్టమని భార్యను కోరాడు. బియ్యం లేక వంట చేయలేదని భర్తకు చెప్పడంతో.. చేతికి దొరికిన చాకుతో భార్య చేతులు, కాళ్లు మీద విచక్షణా రహితంగా కోసేయడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.