ప‌్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మకు అలంకరణ నిమిత్తం ప్రత్యేకంగా చేయించిన 126 గ్రాముల 300 మిల్లిగ్రాములు (రాళ్ళతో కలిపి) బరువున్న బంగారు హంసల హారాన్ని బహూకరించారు.
తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌కు చెందిన దాత దానం నాగేంద్ర కుటుంసభ్యులు అలంకరణ నిమిత్తం చేయించిన బంగారు హంసల హారాన్ని మంగళవారం ఇంద్రకీలాద్రికి విచ్చేసి ఆలయ ఈవో ఎం.వి.సురేష్‌బాబుకు అందజేశారు.
హారంలో 177 తెలుపు, 49 ఎరుపు, 20 పచ్చ మరియు 10 ముత్యాలు పొదిగినట్లు దాతలు తెలిపారు. ఈ సందర్భంగా దాతలకు అమ్మవారి దర్శనానంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఈవో సురేష్‌బాబు వారికి అమ్మవారి ప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు.