Publish Date: Wed, 23 Jun 2021 (14:07 IST)
Updated Date: Wed, 23 Jun 2021 (14:08 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కేటుంబంలోని నలుగురు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
కర్నూలుకు చెందిన ప్రతాప్, హేమలత అనే దంపతులు ఉన్నారు. వారికి కుమారుడు జయంత్, కూతురు రిషిత ఉన్నారు. ప్రతాప్ టీవీ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు.
అయితే, మంగళవారం రాత్రి నలుగురు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే ఉదయం ఇంట్లోనుంచి ఎవరూ రాకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు. అప్పటికే నలుగురు విగత జీవులుగా పడి ఉన్నారు. ఘటనా స్థలంలో దొరికిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇటీవల సన్నిహితులు, బంధువులు మరణించడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అందులో వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.