Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కోవిడ్ వ్యాక్సినేషన్ తో భయం వద్దు: డిప్యూటీ సిఎం

కోవిడ్ వ్యాక్సినేషన్ తో భయం వద్దు:  డిప్యూటీ సిఎం
, శనివారం, 16 జనవరి 2021 (18:43 IST)
కోవిడ్ ప్రపంచాన్ని గడగడలాడించిన సమయంలో మన  ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి కరోనాతో సహజీవనం చేయకతప్పదని, భయం వద్దు అని బరోసా ఇచ్చి, ప్రజల  ప్రాణాలు కాపాడతానని మాట ఇచ్చారని ఆమెత మేరకు రాష్ట్ర ప్రజలను ఎన్నో విధాలుగా ఆదుకున్నారని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. 
 
శనివారం మద్యాహ్నం స్థానిక రుయా ఆసుపత్రిలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఉపముఖ్యమంత్రి ప్రారంభించారు.  రిజిస్ట్రేషన్ ప్రక్రియ, ఎన్ రోల్ మెంట్ విధానం,  వ్యాక్సిన్ ఇచ్చినవారికి తీసుకునే జాగ్రత్తలను స్వయంగా పరిశీలించి వ్యాక్సిన్ తీసుకున్న మెటర్నటీ నర్సులు కరుణకుమారి, రాజేశ్వరమ్మలతో మాట్లాడారు.
 
అనంతరం ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి  మీడియాకు వివరిస్తూ కోవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి డాక్టర్లు సేవలందించి ప్రజల్లో దేవుళ్లుగా నిలిచారని వారికే మొదటి ప్రాధాన్యతనిచ్చి నేడు దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ అందించడం శుభపరిణామమని అన్నారు. 
 
ఈ వ్యాక్సిన్ తో ఎవరికి భయం వద్దు వేసుకుంటే మంచిదని అన్నారు. కోవిడ్ సమయంలో ముఖ్యమంత్రి కరోణా  సోకిన  ఒక్కొక్క వ్యక్తికి రోజు రూ.550/- ఖర్చు చేశారని , డిశ్చార్జి సమయంలో ఇంటివద్ద మంచి ఆహారం తీసుకోవాలని రూ.2000/- అందించారని అన్నారు.
 
కరోనా కష్టాల్లో రేషన్ బియ్యం 2 నెలకు రెండు సార్లు, రూ.1000/- లను పేదలకు అందించారని అన్నారు.  మొదట విడతలో వైద్య సిబ్బంది, రెండో విడత పోలీసులకు ఈ వ్యాక్సిన్  అందించనున్నారని తెలిపారు. ఈ వ్యాక్సిన్ 18 సంవత్సరాలలోపు పిల్లలకు అవసరం లేదని షుగర్, డయాలసిస్, బిపి, క్యాన్సర్ ఉన్న వ్యక్తులు వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. 
 
మూడవ  విడతలో  50 సంవత్సరాలు  పై బడినవారికి ప్రాధాన్యం ఉంటుందని డాక్టర్లు కరోనాతో పోరాడిన స్పూర్తితోనే వ్యాక్సినేషన్ ప్రజలకు అందించి ఆరోగ్యవంతులుగా మార్చాలని కోరారు. జిల్లాకు 41,500 వాక్సిన్ డోసులు అందాయని, ప్రత్యేకంగా జిల్లా వ్యాప్తంగా  ఏర్పాటు చేసిన  29 కేంద్రాలద్వారా అందిస్తారని తెలిపారు.
 
ఉపముఖ్యమంత్రి పర్యటనలో కోవిడ్ రుయా స్పెషల్ ఆఫీసర్  ప్రభాకరరెడ్డి, రుయా సూపరింటెండెంట్ డా.భారతి,  వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా.జయ భాస్కర్, డిఎంహెచ్ఓ పెంచలయ్య, డి సి హెచ్ ఎస్ సరలమ్మ, రుయా డెవెలప్ మెంట్ కమిటీ వర్కింగ్ ఛైర్మన్ చంద్రశేఖర్, ఆర్ఎంఓలు హరికృష్ణ, ఇ.బి. దేవి, సరస్వతి  నగరపాలక వైద్య అధికారి  సుధారాణి, పి ఆర్ ఓ కిరణ్ , వైద్యసిబ్బంది  పాల్గొన్నారు. ప్రసూతి ఆసుపత్రి వైద్యేతర  సిబ్బంది సుధాకర్, నరేష్, సంపత్ లు వ్యాక్సిన్ తీసుకున్నవారిలో ఉన్నారు. జెసి(డి) ఉపముఖ్యమంత్రి పర్యటనకు మునుపు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దక్షిణ భారతదేశంలో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టిన మొట్టమొదటి విమానాశ్రయం : మంత్రి మేకపాటి