Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బిగ్ బాస్ షో అనేది లైసెన్స్ వ్యభిచారం లాంటిది: సీపీఐ నారాయణ

Advertiesment
CPI Narayana
బిగ్ బాస్ షోపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాగార్జున లాంటి ప్రముఖులు ఇలాంటి షోలకు యాంకర్‌గా వెళ్తారా అని నారాయణ ప్రశ్నించారు. అన్నమయ్య, రామదాసు లాంటి సినిమాలు చేసిన వ్యక్తి ఇది చేస్తారా అంటూ అడిగారు. 
 
బిగ్ బాస్ షో అనేది లైసెన్స్ వ్యభిచారం లాంటిదని, ఇది అనైతికం, అక్కడ యువతీ, యువకుల్ని పెట్టి బ్రోతల్ హౌస్ నిర్వహిస్తున్నారని నిప్పులు చెరిగారు నారాయణ. తాను నేను ఫిర్యాదు చేసిన తర్వాత.. లైవ్ కెమెరాలు పెడుతున్నారని చెప్పారు. 
 
బిగ్ బాస్ షోపై సోషియల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నామని, క్లీన్ ఎంటర్‌టైన్మెంట్ పేరుతో యాప్ విడుదల చేస్తున్నామని ఓ రేంజ్‌ లో రెచ్చి పోయారు నారాయణ.
 
గతంలో కోకోకోలా  యాడ్ నుంచి చిరంజీవి కూడా తప్పుకున్నారు. సినిమా టికెట్ల ధరలు తగ్గించడమన్నది సరైన చర్యే.. కానీ చిరంజీవి, కొందరు వ్యక్తులను మాత్రమే పిలిచి మాట్లాడారన్నారు నారాయణ.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీ ఉద్యోగులకు షాక్ : 10.10 తర్వాత వస్తే వేతనంలో కోత