Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆడుదాం ఆంధ్రాలో అవినీతి, ఆర్కే రోజా అరెస్ట్ ఖాయమా?!!

Advertiesment
Roja Adudam Andhra
గత ప్రభుత్వ హయాంలో క్రీడాశాఖ మంత్రిగా పనిచేసిన ఆర్కే రోజా ప్రస్తుతం కూటమి ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. మరోవైపు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలను సైతం వదిలిపెట్టడంలేదు. కూటమి ప్రభుత్వానికి దత్తపుత్రికలా షర్మిల పనిచేస్తున్నారనీ, ఆమెకి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత లేదంటూ తాజాగా విమర్శించారు.
 
ఇదిలావుంటే రోజా క్రీడల శాఖమంత్రిగా వున్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆడుదాం ఆంధ్రా అంటూ కార్యక్రమాలు నిర్వహించారు. దీనిపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులు ఛేపట్టిన విచారణలో ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంలో భారీగా అవినీతి జరిగినట్లు తేల్చింది. సుమారు రూ. 40 కోట్ల మేర నిధులు పక్కదారి పట్టాయని అధికారులు తేల్చారు. దీనితో అప్పటి ఈ కార్యక్రమాలన్నీ ఆనాటి క్రీడాశాఖామంత్రి ఆర్కే రోజా హయాంలోనే జరిగాయని చెపుతున్నారు. ఆ ప్రకారంగా చూస్తే రోజాను ఏ క్షణమైనా అరెస్ట్ చేయడం ఖాయం అని అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భర్త నల్లగా ఉన్నాడనీ ప్రియుడితో కలిసి హత్య చేసి భార్య... ఎక్కడ?