Publish Date: Fri, 10 Apr 2026 (12:02 IST)
Updated Date: Fri, 10 Apr 2026 (12:28 IST)
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై వైసీపీ నేత రోజా మండిపడ్డారు. కూటమి పార్టీలకు షర్మిల దత్తపుత్రికగా మారిపోయారని విమర్శలు గుప్పించారు. కోట్లాదిమంది దేవుడిగా పూజించే వైఎస్సార్ గారిని జీవితాంతం వ్యతిరేకించిన ఏపీ సీఎం చంద్రబాబుతో షర్మిల చేతులు కలిపిందని ఫైర్ అయ్యారు.
జాతీయ స్థాయిలో కూటమి పార్టీలను కాంగ్రెస్ వ్యతిరేకిస్తే మీరు మాత్రం ఇక్కడ ఎందుకు చేతులు కలిపారో ప్రజలకు తెలియదనుకుంటున్నారా? అంటూ ప్రశ్నించారు. వైఎస్సార్ గారికి నిజమైన వారసుడు మా జగనన్నే అని ప్రజలు ఎప్పుడో నిర్ణయించారు.
రాష్ట్ర రాజకీయాలను, ప్రజల భవిష్యత్తును పేకాటగా చూస్తున్న మీకు రాజకీయ పరిణితి ఏ మాత్రం ఉందో అర్థమవుతోందని రోజా నిప్పులు చెరిగారు. కూటమి నాయకులకు సలాం కొడుతున్న షర్మిలకు వైకాపా అధినేత జగన్ గురించి మాట్లాడే అర్హత వుందా అంటూ సూటిగా ప్రశ్నించారు.