Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కమీటీలకు క్షేత్రస్ధాయి పరిశీలన అవసరం... శాస‌న స‌భ స్పీకర్

Advertiesment
కమీటీలకు క్షేత్రస్ధాయి పరిశీలన అవసరం... శాస‌న స‌భ స్పీకర్
, మంగళవారం, 3 డిశెంబరు 2019 (06:16 IST)
ప్రజలు, చట్టసభల ద్వారా ఎన్నికైన సభ్యులు క్షేత్ర స్ధాయిలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను పరిశీలించాల్సిన అవసరం మన భాద్యత అని శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం పిలుపునిచ్చారు.

శాసన సభ సమావేశ మందిరంలో సోమవారం శాసన సభ నూతన కమీటీ చైర్మన్లు, సభ్యుల సమావేశం జరిగింది. అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు ఈ కార్య‌క్ర‌మానికి అధ్యక్షత వహించారు. ఈ సంద‌ర్భంగా స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు క్షేత్ర స్ధాయిలో ప్రజలకు అందేలా కమీటీలు పరిశీలన చేయాలన్నారు.

ఫ‌లితంగా ప్రజల్లో జవాబుదారీతనం, మనపై నమ్మకం పెరుగుతుందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పధకాలు సమర్ధతవంతగా అమలుచేసే క్రమంలో ఎదురవుతున్న‌ ఇబ్బందులను కమీటీలు తెలుసుకొని నివేదిక ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంటుందన్నారు. ఇలా చేయడం వల్ల అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో సంక్షేమ పధకాలను ప్రజలకు చేరువ చేయవచ్చునన్నారు.

ఈ క్రమంలో ఎవరు నిర్లక్ష్యం వహించిన సంబంధిత అధికారులకు చర్యలు తీసుకొనేందుకు సభ్యులు సిఫార్సు చేయవచ్చునన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ప్రజా ప్రతినిధులు వారధిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో మహీళలకు సమాన అవకాశాలు కల్పిస్తుందన్నారు. ఈ క్రమంలో గ్రామా సచివాలయల ఉద్యోగాలలో రిజర్వేషన్లు, రాజకీయ ప్రతినిధ్య, నామినేటేడ్ పదవుల్లో 50% అవకాశాలు కల్పించినట్లు పెర్కొన్నారు.

సమాజంలో ఎస్.సి, ఎస్టీ, బిసీ మైనారిటీలతో పాటు అగ్ర కులాలలో పేదలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించేందుకు తీసుకున్న చర్యలను గుర్తు చేశారు. ప్రతి నెల ఈ కమీటీలు సమావేశమై సంక్షేమ పధకాల అమలు తీరు, విధి విధానాలు, క్షేత్ర స్ధాయిలో సంక్షేమ పధకాలు అమలు విధానం తదితర అంశాల పై చర్చిస్తారని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు.

దీని పై అవసరమైతే జిల్లా పర్యాటనలు కూడా చేసే అవకాశం ఉందన్నారు. పధకాల అమలులో ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించేందుకు తీసుకొవలసిన చర్యలకు సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశాలకు ఏర్పాటు చేయచ్చునన్నారు. శాసన వ్యవస్ధ ద్వారా ఎన్నికైన ఈ కమీటీలకు అన్ని రకాల విస్తృత అధికారాలు ఉంటాయని స్పీకర్ తెలిపారు.

శాసన సభ సమావేశాల తరువాత ప్రతి కమీటీకి క్యాలండర్ విధి విధానాలు ద్వారా తెలియజేయడం జరుగుతుందని స్పీకర్ తెలిపారు.  వన్యప్రాణుల, పర్యావరణ పరిరక్షణ కమిటీ ఛైర్మన్ గా తమ్మినేని సీతారాం, షెడ్యూల్డ్ కుల సంక్షేమం కమీటీ ఛైర్మన్‌గా గొల్ల బాబురావు, గిరిజన సంక్షేమ శాఖ కమీటీ ఛైర్మన్ గా తెల్లం బాలారాజు, ముస్లీం మైనారీటీ సంక్షేమ శాఖ ఛైర్మన్ గా మహ్మమద్ ముస్తాఫా, స్త్రీ శిశు, వికలాంగుల, వృద్ధుల సంక్షేమ శాఖ ఛైర్ పర్సన్‌గా వి.కళావతి, సబార్డినేటివ్ శాసనసభ కమీటీ ఛైర్ పర్సన్ గా పమిడి శమంతకమణి,

బిసీ సంక్షేమ శాఖ కమీటీ ఛైర్మన్‌గా జంగా కృష్ణమూర్తి, లైబ్రరీ కమీటీ ఛైర్మన్ గా అంగర రమ మోహన్ ఛైర్మన్ల హోదాలో తొలి సమావేశానికి హజరయ్యారు. వీరితో పాటు ప్రతి కమీటీలో 11 మంది సభ్యులుగా కొనసాగుతారని అసెంబ్లీ కార్యదర్శి బాలాకృష్ణమాచార్యులు తెలిపారు. సమావేశంలో ఆయా కమీటీలకు సంబంధించిన ప్రభుత్వ సెక్రటరీలు విధి విధానాలను వివ‌రించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విధ్వంసానికి, వికృత చర్యలకు కేరాఫ్‌ జగన్ పాలన.. కళా వెంకట్రావు బహిరంగ లేఖ