Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీలో పరిశ్రమలకు పెద్దపీట.. ఏపీ సీఎం జగన్

jagan
, శుక్రవారం, 4 నవంబరు 2022 (12:24 IST)
తూర్పుగోదావరిజిల్లా గోకవరం మండలం గుమ్మళ్లదొడ్డిలో అస్సాగో బయో ఇథనాల్‌ కంపెనీకి సీఎం జగన్‌ శంకుస్థాపన చేశారు. ఏపీకి ఇథనాల్ ప్లాంట్‌ రావడం చాలా హ్యాపీగా వుందన్నారు. ఈ ప్లాంట్‌ వలన రైతులు, స్థానిక యువతకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు.

ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రాష్ట్రంలో బయో ఇథనాల్‌ యూనిట్లు ఏర్పాటు చేయడానికి అనేక సంస్థలు ముందుకొస్తున్నాయి. ఇందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం గుమ్మళ్ళదొడ్డి దగ్గర 270 కోట్లతో అస్సాగో ఇండస్ట్రీస్‌ ఏర్పాటు చేశారు.
 
రాజమండ్రి సమీపంలోని ఏపీఐఐసీ ఇండస్ట్రియల్‌ పార్క్‌లో 20 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ గ్రీన్‌ఫీల్డ్‌ యూనిట్‌ ద్వారా రోజుకు 200 కిలోలీటర్ల బయో ఇథనాల్‌ ఉత్పత్తి అవుతుంది. ఈ యూనిట్‌ ద్వారా ప్రత్యక్షంగా 100 మందికి, పరోక్షంగా 400 మందికి ఉపాధి లభించనుంది.  
 
ఈ యూనిట్‌ ద్వారా 500 మందికి ఉపాధి లభించడమే కాకుండా వ్యవసాయ ఆధారిత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ రైతులకు అదనపు ప్రయోజనం లభిస్తుంది. హరిత ఇంధనానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ రంగంలో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రత్యేకంగా బయో ఇథనాల్‌ పాలసీని రూపొందిస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పుట్టినెల రోజులు కాలేదు.. శిశువు కడుపులో 8 పిండాలు