Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పుట్టినెల రోజులు కాలేదు.. శిశువు కడుపులో 8 పిండాలు

baby legs
, శుక్రవారం, 4 నవంబరు 2022 (11:53 IST)
పుట్టినెల రోజులు కూడా ఆ శిశువు కడుపులో 8 పిండాలు వున్నట్లుగా గుర్తించారు. ఈ ఘటన ఝార్ఖండ్‌ రాజధాని రాంచిలో చోటుచేసుకుంది. ప్రపంచ వైద్య చరిత్రలోనే ఇది వింతే కాదు.. అరుదైన ఘటనగా నిలిచింది. వివరాల్లోకి వెళితే.. రాంచీలోని రామ్‌గఢ్‌లో అక్టోబరు 10న ఓమహిళ ఓ పాప జన్మనిచ్చింది. 
 
ప్రసవం తరువాత డిశ్చార్జ్ అయి ఇంటికెళ్లిన తరువాత బిడ్డ పదే పదే ఏడుస్తుండటంతో తల్లిదండ్రులో ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకొచ్చారు. అప్పటికి పాప పుట్టి 21 రోజులు అయ్యింది. 
 
పాపను పరీక్షించిన డాక్టర్లు కడుపునొప్పి అని గుర్తించారు. వెంటనే పరీక్షలు చేశారు. సీటీ స్కాన్ నిర్వహించిన డాక్టరు శిశువు కడుపులో కణితులు ఉన్నట్టు గుర్తించారు. ఆ తరువాత హాస్పిటల్ లోనే 21 రోజులు పర్యవేక్షణలో ఉంచారు.
 
ఈ క్రమంలో నవంబర్ 1న కణితులు తొలగించేందుకు సీనియర్ డాక్టర్లు ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేస్తున్న డాక్టర్లు లోపల కనిపించిన దృశ్యం చూసి షాకవుతున్నారు. అయితే కణితులు సరిగా అభివృద్ధి చెందని పిండాలని గుర్తించారు. అంతే సీనియర్ డాక్టర్లు కూడా షాక్ అయ్యారు. అలా గంటన్నరపాటు ఆపరేషన్ చేసి ఆ పిండాలను తొలగించారు.
 
శిశువుల పొట్టలో అభివృద్ధి చెందని పిండాలు వెలుగు చూసిన ఘటనలు ప్రపంచవ్యాప్తంగా వందలోపే ఉన్నట్టు ఈ సందర్భంగా డాక్టర్లు వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్ ఇంటి వద్ద రెక్కీ.. మంత్రి జోగి రమేష్ ఏమన్నారంటే?