ఇండియన్ నేషనల్ కమిటీ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజీ (ఐఎన్‌సిఐడి) ఆధ్వర్యంలో జరిగే ఐసిఐడి కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరవుతారని విశాఖపట్నం జాయింట్ కలెక్టర్ కెఎస్ విశ్వనాథన్ తెలిపారు.
ఈ అంతర్జాతీయ కార్యక్రమానికి 90 దేశాల నుంచి ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ దేశాల నుంచి దాదాపు 300 మంది ప్రతినిధులు నీటిపారుదల, నీటి వనరుల సంరక్షణకు సంబంధించిన ముఖ్యమైన అంశాలపై చర్చిస్తారు.
నవంబర్ 2 నుంచి 8 వరకు విశాఖపట్నంలో జరగనున్న ఇంటర్నేషనల్ కమీషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజీ (ఐసిఐడి) 25వ మహాసభలను, 75వ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆఫ్ ఐసిఐడిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు.
ఆరు దశాబ్దాల తర్వాత భారతదేశంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. విశాఖపట్నంలో అత్యంత వైభవంగా నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను శనివారం జాయింట్ కలెక్టర్ కెఎస్ విశ్వనాథన్ ఉన్నతాధికారులతో సమీక్షించారు.
ఇండియన్ నేషనల్ కమిటీ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజీ (ఐఎన్ సీఐడీ) ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరవుతారని తెలిపారు.