Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భర్త ప్రైవేట్ పార్ట్స్‌పై కొట్టి చంపేశా... భార్య వాంగ్మూలం

Advertiesment
భర్త ప్రైవేట్ పార్ట్స్‌పై కొట్టి చంపేశా... భార్య వాంగ్మూలం
, గురువారం, 12 ఆగస్టు 2021 (09:46 IST)
ఏపీలోని చిత్తూరు జిల్లాలో ఓ దారుణం జరిగింది. మద్యం సేవించి వచ్చి నిత్యం వేధిస్తున్న భర్తను కట్టుకున్న భార్య అతి కిరాతకంగా అత్య చేసింది. భర్త మర్మాంగంపై కొట్టి చంపేసింది. ఆ తర్వాత మిద్దె మేడపై నుంచి జారి కిందపడి మృతి చెందినట్టు నమ్మించి అంత్యక్రియలు పూర్తి చేసింది. కానీ, అత్తింటి వారు చేసిన ఫిర్యాదుతో ఆమె చేసిన కిరాతక చర్య బయటపడింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని ప‌ల‌మ‌నేరు గ్రామానికి చెందిన కేశవ అనే వ్యక్తి ఉన్నారు. ఈయనకు మద్యం సేవించే అలవాటు ఉంది. ప్రతి రోజూ మద్యం సేవించి వచ్చి భార్యను చిత్ర హింసలకు పెట్టేవాడు. వీటిని భరించలేని భార్య... మద్యం మత్తులో ఉన్న భర్త కేశవను హతమార్చింది. 
 
అయితే తన భర్త మద్యం మత్తులో ఇంటి మేడపై నుంచి జారిపడినట్లు ఇంటి పక్క వారికి, పోలీసులను ఆమె నమ్మించింది. ఈ ఘటన మే 29న జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా తన కుమారుడు మృతిపై తనకు అనుమానం ఉందని మృతుడు కేశవ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టగా అసలు నిజం బయటపడింది. 
 
పోలీసులు కేశ‌వ భార్య‌ను అదుపులోకి తీసుకుని విచారించ‌గా అస‌లు నిజం భ‌య‌ట‌పెట్టేసింది. త‌న భర్త ప్ర‌తి రోజూ మ‌ద్యం సేవించి వ‌చ్చి వేధింపుల‌కు గురిచేస్తున్నాడ‌ని అందుకే మ‌ర్మాంగంపై కొట్టి చంపాన‌ని నిజం ఒప్పుకుంది. దీంతో నిందితురాలిపై పోలీసులు కేసు న‌మోదు చేసుకుని అరెస్ట్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్రబాబు కట్టించిన టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు కేటాయించాలి: సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి