Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 26 April 2025
webdunia

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి శుభాకాంక్షలు

Advertiesment
Chief Minister
, సోమవారం, 25 జనవరి 2021 (19:58 IST)
72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలోనే ఎంతో గొప్పదైన మన రాజ్యాంగం అమలు ప్రారంభమై 71 సంవత్సరాలు పూర్తి చేసుకుని 72లోకి అడుగు పెడుతున్న ఈ శుభ సమయంలో రాజ్యాంగ పీఠికలో ప్రస్తావించిన ప్రతి ఒక్క మాటా ఎంత విలువైనదో,  ప్రతి ఒక్కరూ అర్ధం చేసుకోవాలని కోరారు.
 
సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామిక గణతంత్రమైన మన దేశంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయంతో పాటు, భావపరమైన, వ్యక్తీకరణ పరమైన, మతపరమైన స్వాతంత్య్రాలను మన రాజ్యాంగం ప్రతి ఒక్క పౌరుడికి ప్రసాదించిందన్నారు.
 
పౌరులందరికీ సమాన హోదాను, సమాన అవకాశాలను పెంపొందించేలా మన రాజ్యాంగం దిశా నిర్దేశం చేసిందని, సోదర భావంతో కలిసి ఉండాలని నిర్దేశించిందని, ఈ అన్ని సూత్రాలకు ప్రతిరూపంగానే ఆంధ్రప్రదేశ్‌లో గత 20 నెలలుగా పరిపాలన సాగుతోందని ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీ పంచాయతీ ఎన్నికలు: మీ నామినేషన్ తీసుకోవడంలేదా? ఐతే ఈ పని చేయండి