Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వైశ్యుల పట్ల ముఖ్యమంత్రి నిర్ణయం సాహసోపేతమైనది: మంత్రి పేర్ని నాని

వైశ్యుల పట్ల ముఖ్యమంత్రి నిర్ణయం సాహసోపేతమైనది: మంత్రి పేర్ని నాని
, సోమవారం, 15 నవంబరు 2021 (22:29 IST)
దేవుడి ఆస్తులు కైంకర్యంకు గురి కాకుండా మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఆర్యవైశ్యుల దేవాలయాల నిర్వహణ విషయంలో కొన్ని మినహాయింపులు ఇస్తే  ఆయన తనయుడిగా ముఖ్యమంత్రి  జగన్‌ మరో అడుగు ముందుకేసి ఆర్యవైశ్య సత్రాలను క్రయ విక్రయాలు జరపడం మినహా దేవదాయశాఖ అన్ని సెక్షన్ల నుంచి వెసులుబాటు కల్పించిన నిర్ణయం ఎంతో సాహసోపేతమైనదని రాష్ట్ర రవాణా , సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) కొనియాడారు.     
 
సోమవారం సాయంత్రం స్థానిక ఆర్ అండ్ బి అతిధి గృహంలో మచిలీపట్నం ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు మంత్రి పేర్ని నానిను ,ఎండోమెంట్ అసిస్టెంట్ కమీషనర్  వి.సత్యనారాయణ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆర్యవైశ్య సత్రాలు, ఆర్యవైశ్య అన్నదాన సత్రాల నిర్వహణ ఆర్య వైశ్యులకే అప్పగిస్తూ కేబినెట్‌లో ఇటీవల తీర్మానం చేసినందుకు వారు కృతజ్ఞతలు మంత్రికి మచిలీపట్నంకు చెందినపలువురు ఆర్య వైశ్య ప్రముఖులు తెలిపారు. 

మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రి వెనుక ఉన్న పల్లపోతు సుబ్బారావు ధర్మ సత్రం, చిట్టూరి వీరయ్య ధర్మ సత్రం, తాడేపల్లి వారి చౌల్ట్రీలు, అన్నదాన సత్రాలను దేవాదాయ చట్టం పరిధి నుంచి మినహాయిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందని  పాలనాపరమైన అంశాల్లో అవకతవకలు ఉన్నట్టుగా వెల్లడైతే తక్షణం ప్రభుత్వం ఈ మినహాయింపును రద్దు చేస్తుందని షరతు విధించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రేపు తెరాస శాసనసభాపక్షం సమావేశం