Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రేపు తెరాస శాసనసభాపక్షం సమావేశం

Advertiesment
TRS Legislative
, సోమవారం, 15 నవంబరు 2021 (22:26 IST)
తెరాస అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ఆ పార్టీ శాసనసభాపక్షం రేపు సమావేశం కానుంది. ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వం, భాజపా వైఖరిపై సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు.

కేంద్ర ప్రభుత్వం ఒక తీరు, రాష్ట్ర భాజపా మరోతీరు వ్యవహరిస్తూ రైతులను అయోమయానికి గురి చేస్తోందని తెరాస ఆరోపిస్తోంది. ఈనెల 12న నియోజకవర్గాల వారీగా ధర్నాలు కూడా నిర్వహించింది. కేంద్రం స్పష్టతనిచ్చే వరకూ ఆందోళనలు కొనసాగిస్తామని తెరాస ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

రేపు జరగనున్న సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణను ఖరారు చేయనుంది. సీఎం కేసీఆర్ నేతృత్వంలో దిల్లీలో రైతుదీక్ష లేదా ధర్నా చేపట్టాలని తెరాస భావిస్తున్నట్లు తెలుస్తోంది.

కేంద్ర ప్రభుత్వం వైఖరి, రాష్ట్రానికి జరగుతున్న అన్యాయం, భాజపా అనుసరిస్తున్న విధానాలు, విపక్షాల ప్రచారాన్ని ఎలా తిప్పికొట్టాలనే విషయాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. దిల్లీ స్థాయి ఆందోళనతో పాటు.. రాష్ట్రంలో ఏ రూపంలో ఆందోళన కొనసాగించాలో రేపు వ్యూహాలను ఖరారు చేయనున్నట్లు సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాధ్యతారాహిత్యంగా బండి సంజయ్: మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్