Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎమ్మెల్సీ ఆఫర్ .. సిద్దిపేట కలెక్టర్ రాజీనామా

Advertiesment
ఎమ్మెల్సీ ఆఫర్ .. సిద్దిపేట కలెక్టర్ రాజీనామా
, సోమవారం, 15 నవంబరు 2021 (14:47 IST)
తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా క‌లెక్ట‌ర్ వెంక‌ట్రామి రెడ్డి త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. త‌న రాజీనామా లేఖ‌ను తాత్కాలిక స‌చివాల‌యం బీఆర్కే భ‌వ‌న్‌లో ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్‌కు అంద‌జేశారు. వెంక‌ట్రామిరెడ్డి త్వ‌ర‌లోనే టీఆర్ఎస్ పార్టీలో చేరే అవ‌కాశం ఉంది. 
 
ఈయనకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్సీ పదవిని ఆఫర్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ స్థానిక సంస్థల కోటాలో కలెక్టర్ పోటీ చేస్తున్నట్లు పెద్ద ఎత్తున పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఈయన పేరు మాత్రం ఎన్నికలొచ్చిన ప్రతిసారీ తెరపైకి వస్తోంది. స్థానిక సంస్థల కోటాలో వెంకట్రామిరెడ్డి పేరును కేసీఆర్ పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. 
 
అటు ప్రగతి భవన్ నుంచి పేరు ఖరారైందనే పిలుపు వచ్చిన మరుక్షణమే వెంకట్రామిరెడ్డి తన కలెక్టర్ పదవికి రాజీనామా చేశారు. వాస్తవానికి ఈయన పేరు ఇలా ప్రచారంలోకి రావడం ఇదేం మొదటి సారేం కాదు.. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఒకానొక దశలో మల్కాజిగిరి ఎంపీ స్థానానికి టీఆర్ఎస్ పార్టీ తరఫున వెంకట్రామిరెడ్డికి టిక్కెట్ దాదాపు ఖరారైనట్లు ప్రచారం జరిగింది. చివరి క్షణంలో అది కూడా చేజారడంతో ఆయన కొంత నిరాశకు లోనయ్యారు. తర్వాత కలెక్టర్‌గా తనపని తాను చేసుకుపోతున్నారు. ఇపుడు ఆయన తన పదవికి రాజీనామా చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కుప్పంలో దొంగ ఓటర్లను మావాళ్ళు రాత్రే పట్టుకున్నారు...