Publish Date: Tue, 26 Oct 2021 (12:22 IST)
Updated Date: Tue, 26 Oct 2021 (12:31 IST)
తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేట కలెక్టర్ స్థానిక రైతులకు ఓ హెచ్చరిక చేశారు. ముఖ్యంగా, యాసంగిలో జరిగిన ఓ కార్యక్రమంలో కలెక్టర్ వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సిద్దిపేట జిల్లాలో ఒక్కఎకరా వరిసాగు చేయకుండా రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులను జిల్లా కలెక్టర్ వెంకట్రామి రెడ్డి ఆదేశించారు.
యాసంగిలో వరికి ప్రత్యామ్నాయ పంటల సాగు అంశంపై జిల్లా వ్యవసాయ, రెవెన్యూ అధికారులు, విత్తన డీలర్లలతో ఆయన సమీక్ష నిర్వహించారు. స్థానిక ప్రజా ప్రతినిధుల సహాకారంతో యాసంగిలో వరికి ప్రత్యామ్నాయంగా కూరగాయలు, పప్పు దినుసులు, నూనె గింజల పంటలు సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని కోరారు.
వరి విత్తనాలు అమ్మితే చర్యలు తీసుకుంటామని డీలర్లను హెచ్చరించారు. ప్రభుత్వ సూచనలకు విరుద్ధంగా వరి సాగు చేస్తే రైతులదే బాధ్యత అని కలెక్టర్ వెంకట్రామిరెడ్డి హెచ్చరించారు. కలెక్టర్ చేసిన వ్యాఖ్యలపై జిల్లా రైతులు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
ఠాగూర్
Publish Date: Tue, 26 Oct 2021 (12:22 IST)
Updated Date: Tue, 26 Oct 2021 (12:31 IST)