తిరుమలలోని స్వామిపుష్కరిణిలో శ్రీవారి చక్రస్నానం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున 3 నుంచి 6 గంటల వరకు పల్లకి, తిరుచ్చీ ఉత్సవం పూర్తి చేశారు.
అనంతరం వరహాస్వామి ఆలయం వద్ద స్వామివారి చక్రత్తాళ్వార్‌కు స్నపనతిరుమంజనాదులు పూర్తిచేసి.. ఉదయం 6 నుంచి 9గంటల మధ్య చక్రస్నానం చేశారు. ఈ రాత్రికి జరిగే ధ్వజావరోహణంతో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమవుతాయి. చక్రత్తాళ్వార్‌కు చక్రస్నాన ప్రభావం ఆ రోజంతా ఉంటుంది.
చక్రస్నానం అనంతరం సరోవరంలోని పవిత్ర జలాలు అత్యంత మహిమాన్వితం అవుతాయన్నది పురాణ ప్రశస్తి. ఈ మహిమ రోజంతా ఉంటుందని పూజారులు అంటారు.