టీడీపీ నేత జూపూడి ప్రభాకర్, జనసేన నేత ఆకుల సత్యనారాయణ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇవాళ సీఎం జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా ఆకుల సత్యనారాయణ మాట్లాడుతూ.. "జనసేనలో రాజీనామా చేసాను. మేనిఫెస్టో ఎన్నికల ముందు ఇచ్చి ఆ తర్వాత మర్చిపోతారు. కానీ పాలనకు అదే గీటురాయిగా చేసుకున్న వ్యక్తి జగన్. రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రభుత్వ సొమ్ము ఆదా చేస్తున్నారు.
కౌలు రైతులకు కూడా రుణాలు, రైతు భరోసా ఇచ్చారు. వాహన మిత్రతో ఇచ్చిన మాట నిలుపుకున్నారు. నేను కూడా ఈ అభివృద్ధిలో భాగం పంచుకోవాలని చేరాను. మద్య నిషేదంలో గతంలో చాలా మంది హామీ ఇచ్చారు. కానీ జగన్ మాత్రమే దాన్ని అమలు చేసేందుకు నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు.
జూపూడి ప్రభాకర్ రావు మాట్లాడుతూ.. "మంచి పరిపాలన కావాలని, జగనన్న రాజన్న పాలన తెస్తాడాని జనం ఆశీర్వదించారు. టీడీపీలో ఉన్నప్పటికీ ప్రజా నిర్ణయాన్ని శిరసావహించాల్సిందే. మేము తప్పిపోయిన గొర్రెల్లా బయటకు వెళ్లొచ్చు. కానీ జగన్ గారు తన సంకల్పాన్ని కొనసాగించారు.
ఐదుగురి దళితులకు కాబినెట్లో స్థానం ఇచ్చారు. దేశం మొత్తం ఇది ఆదర్శంగా తీసుకుంది. పెట్టిన బిల్లులు రాజ్యాంగబద్ధంగా తీర్చిదిద్దారు. ఎదుగుతున్న రాష్ట్రాలతో పోటీ పడుతున్నాము. ఆయన పరిపాలనను ప్రతి ఒక్కరు ఆహ్వానించాలి. విమర్శించడాని తొందర ఎందుకు? అందుకే వారిని వదిలేసా.
రాజకీయంగా నావైపు జరిగిన కొన్ని తప్పులను సరిదిద్దుకుంటాను" అని స్పష్టం చేశారు. జగన్‌లో ఫెడరల్ క్యాస్ట్రో విధానాలు కనిపిస్తున్నాయన్నారు. ఆంధ్రా ఐరన్ మ్యాన్ విజయసాయిరెడ్డి అని చెప్పారు. పదవులు ఆశించి వైసీపీలో చేరలేదన్నారు.