Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎక్కడైనా ఒక్క ఇల్లైనా ఇచ్చినట్లు వైసీపీ నేతలు నిరూపించగలరా?: నిమ్మల రామానాయుడు

ఎక్కడైనా ఒక్క ఇల్లైనా ఇచ్చినట్లు వైసీపీ నేతలు నిరూపించగలరా?: నిమ్మల రామానాయుడు
, సోమవారం, 23 నవంబరు 2020 (07:16 IST)
టీడీపీప్రభుత్వంలో రాష్ట్రవ్యాప్తంగా 20లక్షల ఇళ్లనిర్మాణం ప్రారంభమైతే, వాటిలో 7లక్షల 58వేల788 టిడ్కో ఇళ్లుంటే, గతప్రభుత్వంలోనే  నిర్మాణం పూర్తైన 2లక్షల62వేల216ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించకుండా జగన్ ప్రభుత్వం కక్షసాధింపులకు పాల్పడుతోందని, నిర్మాణదశలో ఉన్న4లక్షల 96వేల572 టిడ్కోఇళ్లను రివర్స్ టెండరింగ్  పేరుతోరద్దుచేసిన ఘనత కూడా ఈ ప్రభుత్వానిదేనని టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు  మండిపడ్డారు.

ఆయన తననివాసంనుంచి జూమ్ యాప్ ద్వారా విలేకరులతో మాట్లాడారు.  4లక్షల96వేల 572 ఇళ్లను జగన్ ప్రభుత్వం రద్దుచేయడంద్వారా, కేంద్రంనుంచి వచ్చే  రూ.7,448 కోట్లు నిలిచిపోయాయన్నారు.  చంద్రబాబునాయుడు ప్రారంభించాడన్న అక్కసుతో ఇళ్లనిర్మాణాన్ని నిలిపివేయడమే గాక, కేంద్రమిచ్చే రూ7,448కోట్లను కూడా వదులుకోవడానికి జగన్ సిద్ధమవ్వడం దారుణమన్నారు. 

తనచర్యతో పేదలపై జగన్ కు  ఎంతటి కక్ష, కార్పణ్యం ఉందో ఆయన చర్యలతోనే అర్థమవుతో దన్నారు. ముఖ్యమంత్రి, స్పీకర్, మంత్రులు, ఇతరప్రజా ప్రతినిధులు వైసీపీప్రభుత్వం చేపట్టిన ఇళ్లపట్టాల పంపిణీని, టీడీపీ అడ్డుకుంటోందని, కోర్టులకెళ్లిందని అబద్ధపుప్రచారం చేస్తున్నా రన్నారు. నిజంగా ఈ ప్రభుత్వానికి, మంత్రులకు పేదలకు మంచిచేయాలన్న చిత్తశుద్ధి ఉంటే, చంద్రబాబుప్రభుత్వం నిర్మించిన ఇళ్లను వారికిఎందుకు కేటాయించడంలేదో సమాధానంచెప్పాలన్నారు.

టీడీపీ ఇళ్లపట్టాల పంపిణీని అడ్డుకోవడం అవాస్తవమనే విషయం,  డిసెంబర్ 25న ఇళ్లపట్టాలు, ఇళ్లను పంపిణీ చేపడుతున్నట్లు చెబుతున్న ముఖ్యమంత్రి ప్రకటనతోనే తేలిపోయిందన్నారు.  రాజధానిలో భూములకు సంబంధించి, సంవత్సరంలో 8నెలల పాటు నీటిలో ఉండే ఆవభూములకు సంబందించి మాత్రమే కొందరు న్యాయస్థానాలను ఆశ్రయించడం జరిగిందన్నారు.

ప్రభుత్వం పేదలకు పంచాలనుకున్న భూముల్లో కేవలం 10 నుంచి 15శాతం మాత్రమే కోర్టు వివాదాల్లోఉందని, అటువంటప్పుడు మిగిలినభూమిని పంచకుండా ప్రతిపక్షంపై నిందలేయడం ఏమిటని రామానాయుడు పత్రికాముఖంగా ప్రశ్నించారు. దాదాపు సంవత్సరంన్నర నుంచీ పేదలకు ఇళ్లస్థలాలు, ఇళ్లు ఇవ్వకుండా టీడీపీపై విషప్రచారం చేసిన జగన్మోహన్ రెడ్డి, ఇప్పటికైనా తనతప్పు ఒప్పుకొని ముక్కునేలకురాసి పేదలకు క్షమాపణచెప్పాలని  నిమ్మల డిమాండ్ చేశారు. 

ఇళ్లనిర్మాణాలకు సంబంధించి అసత్యాలు చెబుతున్న మంత్రి బొత్స, గతప్రభుత్వంలో జరిగిన అవినీతిని నిరూపించాక మాట్లాడితే మంచిదన్నారు. చదరపు అడుగు నిర్మాణానికి రూ. 1000, 2వేలు, ఒక్కోచోట రూ.6వేల వరకుకూడా తీసుకుంటారని, ఇంటికోసం మనం వెచ్చించేసొమ్ముని బట్టే, ఇంటి నాణ్యత, దానిలోని సదుపాయాలు ఆధారపడి ఉంటాయనే కనీస వాస్తవాన్ని కూడా మంత్రి తెలుసుకోలేకపోతే ఎలాగని నిమ్మల ఎద్దేవాచేశారు. 

టీడీపీప్రభుత్వం టిడ్కోఇళ్లన్నింటినీ షీర్ వాల్ టెక్నాలజీతో నిర్మించిందని, ప్రకృతి విపత్తులను తట్టుకునేవిధంగా, ఆధునిక సౌకర్యాలతో నిర్మించాలని తలపెట్టిందన్నారు. ఇంటిలోపలే కాకుండా, ఇంటిబయట కూడా మంచినీరు, రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ సౌకర్యం వంటి హంగులన్నీ ఉండేలా నిర్మించాలని భావించిందన్నారు. 

అన్నిసౌకర్యాలతో, సకలహంగులతో ఇళ్లనిర్మాణం పూర్తికావడాని కి, ఎల్ అండ్ టీ, టాటా వంటి పేరెన్నికగన్న సంస్థలను  నిర్మాణదారుగా ఎంపికచేయడం జరిగిందన్నారు. జగన్ అధికారంలోకి రాగానే ఇవేవీ పట్టించుకోకుండా, నిర్మాణంలో ఉన్నఇళ్లను నిలిపేసి, మూలన పడేశారన్నారు. 

రివర్స్ టెండరింగ్ పేరుతో రూ.4వేలకోట్లు ఆదాచేస్తామని చెప్పిన మంత్రిబొత్స, ముఖమంత్రి జగన్ లు, నిర్మాణంలో ఉన్నఇళ్లను ఎక్కడికక్కడే నిలిపేయడం ద్వారా ప్రజలకు బాగా ఆదాచేశారని రామానాయుడు దెప్పిపొడిచారు. గతప్రభుత్వం ఎంపికచేసిన నిర్మాణసంస్థను కాదని,  ఊరుపేరులేని సంస్థలకు ఇళ్లనిర్మాణపనులుకట్టబెట్టేందుకు జగన్ ప్రభుత్వం సిద్ధమైందని, ఆక్రమంలోనే శ్రద్ధసంబోరి, ఎన్జీఆర్ కన్సస్ట్రక్షన్స్ వంటి కంపెనీలను తెరపైకి తెచ్చిందన్నారు.

హైదరాబాద్ లో నిర్మాణ పనులుచేసే అనామకసంస్థలకు పనులు అప్పగించడంద్వారా పేదలకు నాసిరకం ఇళ్లనే ఇవ్వాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు స్పష్టంగా అర్థమవుతోందన్నారు. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి హాయాంలో నిర్మంచిన రాజీవ్ స్వగృహ ఇళ్లు ఎలా నిరుపయోగంగా మారాయో ఇప్పటికే చూశామన్నారు. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి, పేదలకోసం ఒకరూపాయి ఎక్కువైనా సరే ఖర్చుపెట్టి, అన్నిహంగులతో ఇళ్లునిర్మించి ఇవ్వాలనుకోవడం తప్పులా అవుతుందో జగన్ ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు 

టీడీపీప్రభుత్వంలో 90 నుంచి 100శాతం వరకు పూర్తైన 2లక్షల 62వేల216 ఇళ్లలో చేయాల్సిన అరకొర పనులు పూర్తిచేసి, జగన్ ప్రభుత్వం లబ్ధిదారులకు ఎందుకు కేటాయించడం లేదో సమాధానం చెప్పాలన్నారు.  ఏడాదికి 5లక్షలఇళ్లను నిర్మిస్తామని వైసీపీ మేనిఫెస్టోలో జగన్ చెప్పాడని, అధికారంలోకి వచ్చిన 18నెలల్లో ఎన్నిఇళ్లునిర్మించి ఎందరికి ఇచ్చాడో  చెప్పాలన్నారు.

జగన్ చెప్పిన ప్రకారం చూస్తే, సంవత్సరంన్నరలో 7.50లక్షలఇళ్లను పూర్తిచేయాల్సి ఉందని, కానీ 18నెలల్లో ఎక్కడాకూడా ఒక్కటంటే ఒక్కఇల్లుకూడా నిర్మించింది లేదని నిమ్మల స్పష్టంచేశారు. కొత్తగా ఇళ్లను నిర్మించకపోగా, చంద్రబాబునాయుడు నిర్మించిన ఇళ్లను లబ్దిదారులకు కేటాయించకపోబట్టే, ప్రతిపక్షపార్టీ, ఇతరపార్టీలతో కలిసి, ‘నాఇల్లు-నాసొంతం’ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగిందన్నారు.

లబ్ధిదారులకు ఇళ్లను కేటాయించకపోతే, టీడీపీ ఆధ్వర్యంలో సంక్రాంతినాటికి గృహప్రవేశాలు చేయిస్తామని హెచ్చరించబట్టే జగన్ ప్రభుత్వం దిగొచ్చిందన్నారు. అందులో భాగంగానే డిసెంబర్ 25నాటికి, ఇళ్లస్థలాలను, ఇళ్లను పంపిణీ చేస్తామని జగన్ చెప్పడం జరిగిందన్నారు. 300 చదరపు అడుగుల ఇంటిని రూపాయికే ఇస్తామని చెబుతున్న జగన్మోహన్ రెడ్డి, గతంలో చంద్రబాబునాయుడు ఏంచెప్పాడో తెలుసుకుంటే మంచిదన్నారు.

గతఎన్నికల సమయంలోనే టిడ్కో కింద నిర్మించిన ఇళ్లన్నింటినీ, బ్యాంకురుణాలతో సంబంధంలేకుండా లబ్దిదారులకు ఉచితంగా అందచేస్తామని చెప్పడం జరిగిందన్నారు. అందుకు సంబంధించి, ఆనాడు టీడీపీ అధినేత మాట్లాడిన వీడియోలను కూడా బయటపెడతామని నిమ్మల స్పష్టంచేశారు. అయిపోయిన పెళ్లికి బాజాలు వాయించినట్లుగా, చంద్రబాబునాయుడు కేటాయించిన ఇళ్లను తానుఇస్తున్నట్లు చెప్పుకుంటున్నాడన్నారు.

రూపాయికే ఇల్లుఇస్తానన్న జగన్ మాటల్లో మోసం ఉందని, 300 చదరపు అడుగుల ఇంటితోపాటు, 360, 430 చదరపు అడుగుల ఇళ్లను  కూడా జగన్ అలానే ఇస్తానని ఎందుకు చెప్పడంలేదన్నారు.  ఎక్కువ చదరపు అడుగుల నిర్మాణంలో ఉన్న ఇళ్లను, అవిఎంపిక చేసుకున్నవారికి కేటాయించకుండా, దానిలో కూడా రాజకీయాలకు తెరలేపారని, ఇప్పటికే వాలంటీర్లు జగన్ స్కీము కావాలా... బాబు పథకం కావాలా అంటూ ప్రశ్నించడం మొదలెట్టారన్నారు.

సకలసౌకర్యాల తో, అన్నిహంగులతో, నాణ్యతతో నిర్మించి, ఉచితంగా అందచేస్తానన్న చంద్రబాబునాయుడి ఇళ్లే తమకుకావాలని లబ్ధిదారులు అంతా చాలాస్ఫష్టంగా చెబుతున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి పథకంపేరుతో తమను మోసగించవద్దని వారంతా వాలంటీర్లక తెగేసి చెబుతున్నారని నిమ్మల తెలిపారు.  గతప్రభుత్వంలోనే ఇళ్లలబ్దిదారులకు ఎన్నిచదరపు గజాలో  చెబుతూ, ప్లాట్ సంఖ్య, ఇంటినంబర్, ఏరియాతో తోసహా పత్రాలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. 

ఇచ్చిన పత్రాల ప్రకారం  300, 360, 430చదరపుఅడుగుల ఇళ్లను, లబ్ధిదారులకు ఉచితంగా కేటాయిచడం తప్ప, జగన్ కు, ఆయనప్రభుత్వానికి చేయడానికి పెద్దగా పనికూడా లేదని రామానాయుడు తేల్చిచెప్పారు. 
 
రాష్ట్రంలో సాగుతున్నది రివర్స్ పాలనఅని, పట్టణాల్లో నివసించే లబ్ధిదారులకు ఎక్కడో దూరంగా 15, 20 కిలోమీటర్ల దూరంలో ఇళ్లపట్టాలు కేటాయిస్తే, అక్కడినుంచి పట్టణానికి రావడానికి ఎన్ని ఇబ్బందులుంటాయనే ఆలోచన ఈప్రభుత్వం ఎందుకు చేయడం లేదన్నారు.  అంతదూరంలో కూడా ఇచ్చేది కేవలం సెంటుస్థలం మాత్రమేనని, దానిలో ఒక కుటుంబం ఎలా నివసిస్తుందో చెప్పాలన్నారు.

పట్టణాల్లోని పేదలకు కనీసం సెంటున్నర, నుంచి 2సెంట్లు, గ్రామాల్లోని వారికి కనీసం రెండు నుంచి మూడు సెంట్ల వరకు ఇంటిస్థలం ఇవ్వాలని టీడీపీతరుపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. తాడేపల్లిలో , హైదరాబాద్ లో, ఇడుపులపాయలో, బెంగుళూరు లో భారీ ప్యాలెస్ లు నిర్మించుకున్న జగన్మోహన్ రెడ్డి, పేదలకు మాత్రం సెంటుమాత్రమే ఇస్తాననడం దారుణమన్నారు. 

ఏపీలో ఇళ్లు, ఇళ్లస్థలాల పేరుతో ప్రభుత్వం భూమాఫియాకు తెరలేపిందని, జరుగుతున్న అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని నిమ్మల డిమాండ్ చేశారు. ఇళ్లస్థలాల పేరుచెప్పి, ఇప్పటికే వైసీపీనేతలు రూ.4వేలకోట్లవరకు కాజేశారన్నారు. ఈ దోపిడీలో ఎవరి ప్రమేయం ఉందో తేలాలంటే సీబీఐ, లేదా సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించడం ఒక్కటే మార్గమన్నారు.

తూర్పు గోదావరిలో ఆవభూములను ఇళ్లపట్టాలకు ఎంపికచేయడాన్ని బట్టే, వైసీపీనేతలు ఎంతలా బరితెగించారో అర్థమవుతోందన్నారు. అనేకప్రాంతాల్లో వైసీపీనేతలు, ఇళ్లపట్టాలకోసం రూ,20నుంచి రూ.25వేలకు వసూలుచేశారని, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కు అందిన ఫిర్యాదులే అందుకు నిదర్శనమన్నారు. ప్రభుత్వ పెద్దల  కనుసన్నల్లోనే ఈ విధమైన కుంభకోణం జరిగిందని, దీనిపై ముఖ్యమంత్రి స్పందించాలన్నారు.

పేదలకోసం టీడీపీప్రభుత్వం నిర్మించతలపెట్టిన టిడ్కో ఇళ్లనే పూర్తిచేసి, అర్హులైన వారికి తక్షణమే కేటాయించాలని, అలా చేయని పక్షంలో లబ్ధిదారులు కడుతున్న అద్దెను ప్రభుత్వమేకట్టాలని నిమ్మల డిమాండ్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉచితంగా వస్త్రాలను అందిస్తున్న 'అమృతహస్తం'...ఎక్కడ?