Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉచితంగా వస్త్రాలను అందిస్తున్న 'అమృతహస్తం'...ఎక్కడ?

ఉచితంగా వస్త్రాలను అందిస్తున్న 'అమృతహస్తం'...ఎక్కడ?
, సోమవారం, 23 నవంబరు 2020 (07:14 IST)
పేదవారికి అన్నం పెట్టడంతో పాటు ఉచితంగా వస్త్రాలను అందిస్తున్న అమృతహస్తం సేవలు ఎనలేనివని, సేవా కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కొనకళ్ల విధ్యాధరరావు అన్నారు. అమృతహస్తం ట్రస్టు ఆధ్వర్యంలో గాంధీనగర్ లోని క్యాంటీన్ నందు  పేద ప్రజలకు ఉచితంగా దుస్తులను అందచేసారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమృతహస్తం ఆధ్వర్యంలో లక్షలాది మందికి ఆకలిని తీర్చడంతో పాటు ఎంతో మందికి కరోనా సమయంలో సేవలను అందించారన్నారు. అలాగే పేదలకు, మహిళలకు, వృద్దులకు ఉచితంగా దుస్తులను పంపిణీ చేసేందుకు ప్రత్యేకంగా ఫ్రీ షాపీని నిర్వహించడం అభినందనీయమని అన్నారు.
 
అమృతహస్తం వ్యవస్థాపక అధ్యక్షురాలు దారా కరుణశ్రీ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు కొన్ని ఎంపికచేసిన స్లమ్ ప్రాంతాలలో మాత్రమే పేద వారికి ఉచితంగా పాత వస్త్రాలను అందచేశామరన్నారు. పేదప్రజలు ప్రతి ఒక్కరికీ దుస్తులు అందాలనే ఉద్దేశంతో గాంధీనగర్ అమృతహస్తం క్యాంటీన్ నందు ప్రత్యేకంగా ఫ్రీ షాపీ నిర్వహించామని ఇక నుండి ప్రతి నెలా ఉచితంగా దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు.

తాము ప్రారంభించిన పంపిణీ కార్యక్రమానికి నగరంలోని చిట్టినగర్, విధ్యాధరపురం, పటమట, గాంధీనగర్, కృష్ణలంక తదితర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో పేదలు ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, వికలాంగుల కూడా వచ్చిదుస్తులను తీసుకువెళ్లారని తెలిపారు. ఈ కార్యక్రమానికి వచ్చిన స్పందనను చూసి ఇక నుండి ప్రతి నెలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించే విధంగా చేస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అమృతహస్తం సెక్రటరీ మహేష్, కార్యదర్శి ఆంజనేయులు, డైరక్టర్ రూప్ నాథ్, కన్వీనర్ గుడివాడ కృష్ణ కిషోర్, కోర్ కమిటీ సభ్యులు రైల్వే శ్రీనివాస్, హేమ, సీతారామయ్య, ఇవెంట్స్ ఎమ్.పూర్ణా, పున్నారావు, శైలజ, గొర్తి చక్రవర్తి, వాలంటరీలు శేఖర్, అరుణ్, వాకర్స్ సభ్యులు బోస్ తదితరులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్రుడిపై ఇంధనం తోడేస్తోరా?