Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీ కరోనా విజృంభనకు వైసీపీ నాయకులే కారణం: చెంగల్ రాయుడు

ఏపీ కరోనా విజృంభనకు వైసీపీ నాయకులే కారణం: చెంగల్ రాయుడు
, శనివారం, 18 జులై 2020 (21:04 IST)
కరోనా విస్తరిస్తున్న సమయంలో నెల్లూరు జిల్లా కలెక్టర్ ను బదిలీ చేయడం దురదృష్టకరమని టీడీపీ నాయకుడు చెంగల్ రాయుడు పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నెల్లూరు జిల్లా కలెక్టర్ శేషగిరిరావును. సెలవు పెట్టేలా ఒత్తిడి చేసి వైసీపీ నాయకులు బదిలీ చేయడం ఘోరమని ఆక్షేపించారు. 

మూడు నెలలుగా నెల్లూరు ఎస్పీ, కలెక్టర్ మీద బలమైన విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. పేదలకు ఇల్ల స్థలాల సేకరణలో కావలి నియోజకవర్గంలో బుడుగుంట గ్రామంలో అధికారులు మంచి భూమిని రూ.12 లక్షలకు ఎంపిక చేశారని, కానీ టీడీపీకి సంబంధించిన భూములని వాటిని రద్దు చేశారని తెలిపారు.

వైసీపీ నేతలు చెప్పిన పనికిరాని భూములను రూ.60 లక్షలకు కొనుగోలు చేయించేలా వైసీపీ నేతలు అధికారులపై ఒత్తిడి చేశారని ఆరోపించారు. హైకోర్టు ఓ వైపు టీడీపీ ప్రభుత్వం కట్టించిన ఇల్లులు ఇవ్వకుండా భూముల విషయంలో ఎందుకంత దూకుడుగా ఉన్నారని ప్రశ్నించిందని గుర్తుచేశారు.

జిల్లా యంత్రాగాన్ని ఒత్తిడికి గురిచేసి పనుల చేయించుకోవడం సమంజసం కాదన్నారు. కన్నీరు పెట్టుకుని నెల్లూరు నుండి  కలెక్టర్ శేషగిరిరావు వెళ్లగొట్టేలా వైసీపీ అరాచకాలకు పాల్పడ్డారని విమర్శించారు. ఏపీలో కరోనా శరవేగంగా విస్తరిస్తోందని, ప్రభుత్వం మద్యం షాపులు తెరచి అధికారుల కష్టాన్ని బూడిదపాలు చేసిందని విమర్శించారు.

గుడికి వెళ్లేందుకు ప్రజలకు అనుమతి ఇవ్వడం లేదని, మందుషాపులకు వెళ్లేందుకు అనుమతి ఇస్తున్నారని మండిపడ్డారు. వాలంటీర్లు అందుబాటులో ఉంటే బియ్యం, పెన్షన్ల కోసం ప్రజలను, వృద్ధులను క్యూలో ఉంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. కరోనా బారిన పడిన డిప్యూటీ సిఎం సిమ్స్ సరైన వైద్యం లేదని హైదరాబాద్ వెళ్లారన్నారు. వైసీపీ నేతల విచ్చిలవిడితనం వల్ల ఇచ్చాపురం నుండి ఇడుపులపాయ వరకు కరోనా పెరిగిందని ఆరోపించారు.

మీటింగులు, స్వాగతాలు పెట్టి కరోనా వ్యాప్తికి వైసీపీ నేతలు కృషి చేశారని పేర్కొన్నారు. ప్రజలతో పూలు చల్లించుకుని వీధుల్లో తిరిగి ప్రజల్నే కరోనా బారిన పడేలా చేశారని విమర్శించారు.. విజయసారెడ్డికి నేషనల్  పర్మిషన్ ఇచ్చినట్లుగా ప్రత్యేక అంబులెన్సులో రాష్ట్రమంతా తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోలీసుల బందోబస్తుతో మద్యం అమ్మిస్తున్నారని తెలిపారు. క్వారంటైన్లలో బోజన వసతి సరిగాలేదని, కరోనా పేషంట్లకు ఇచ్చే రెండు వేల రూపాయలు కూడా వారికి అందనివ్వడం లేదని ఆరోపించారు. కరోనా ఫలితాల్లో జాప్యం జరుగుతోందని అఫిసియల్ గా కేసుల లక్ష పైనే ఉంటాయన్న అనుమానం ఉందన్నారు.

ఇప్పటికైనా వైసీపీ నాయకులు మర్యాదగా ఇంట్లో ఉంటే బాగుంటుందని హెచ్చరించారు. కరోనా ఎదుర్కోవడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కోవాలని హితవు పలికారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో ఇక మండల స్థాయిలోనే పెళ్లిళ్లకు అనుమతి