Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఫైబర్ గ్రిడ్ కేసు: ఏ25గా చంద్రబాబు.. ఆస్తులను అటాచ్ చేస్తూ..

Chandra Babu
, శుక్రవారం, 3 నవంబరు 2023 (10:46 IST)
ఆంధ్రప్రదేశ్‌లో వెలుగు చూసిన ఫైబర్ గ్రిడ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. రూ.114 కోట్ల ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై నిందితులకు చెందిన ఆస్తులను అటాచ్ చేస్తూ ఏపీ హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
 
ఫైబర్ నెట్ ప్రాజెక్టు తొలిదశలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో నిందితుల ఆస్తులను అటాచ్ చేస్తూ ఏపీ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జీవో 180ని హోంశాఖ కార్యదర్శి హరీశ్ గుప్తా జారీ చేశారు.
 
సీఐడీ ఏడీజీ నేతృత్వంలో జరిపిన విచారణలో కుట్రకు సంబంధించిన వాస్తవాలు వెలుగు చూశాయని, నేరపూరిత చర్యల వల్ల ప్రభుత్వానికి రూ.114 కోట్ల నష్టం వాటిల్లిందని తేలింది. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ ఎండీ మధుసూదన్‌రెడ్డి తెలిపారు.
 
ఫైబర్ నెట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ25గా ఉన్నారు. ఏ1గా ఉన్న వేమూరి హరికృష్ణ ప్రసాద్, ఏ11గా ఉన్న తేరా సాఫ్ట్‌వేర్ లిమిటెడ్ డైరెక్టర్ తుమ్మల గోపీచంద్ చంద్రబాబు సహకారంతో ఈ కుట్రకు పాల్పడ్డారు. 
 
నకిలీ ఎక్స్‌పీరియన్స్‌ సర్టిఫికెట్‌తో ఉద్యోగాలు దక్కించుకున్నట్లు సీఐడీ విచారణలో తేలింది.  ప్రభుత్వ ప్రాజెక్టును దక్కించుకునేందుకే అక్రమాలకు పాల్పడ్డాడని తేలింది. విపిలాప్‌కుమార్‌, విజయ్‌కుమార్‌ రామ్‌మూర్తి, కనుమూరి వెంకటేశ్వరరావులకు చెందిన కంపెనీలు ఈ కుట్రకు పాల్పడ్డాయని తెలిపారు.

నాసిరకం పరికరాలతో ప్రభుత్వాన్ని మోసం చేశారని, టెరాసాఫ్ట్‌కు నిధులు విడుదల చేయడంతో ప్రభుత్వ ఖజానాకు రూ.114 కోట్ల నష్టం వాటిల్లిందని వాపోయారు.
 
సీఐడీ విచారణ ఆధారంగా కుట్రకు పాల్పడ్డ పలు కంపెనీల స్థిరాస్తులను అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో ఏడు స్థిరాస్తులను అటాచ్ చేయాలని సీఐడీ అధికారులు ప్రతిపాదించారు.

సీఐడీ ప్రతిపాదనకు హోం మంత్రిత్వ శాఖ ఆమోదం తెలుపుతూ జీఓను విడుదల చేసింది. ఫైబర్ నెట్ స్కాంలో నిందితుడిగా ఉన్న టెర్రా సాఫ్ట్ ఎండీ తుమ్మల గోపీచంద్ ఆస్తులతో పాటు పలు కంపెనీల ఆస్తులను అటాచ్ చేయాలని సీఐడీ హోంశాఖను కోరింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మళ్లీ పెరిగిన బంగారం ధర ... తులం గోల్డ్ రేట్ ఎంత పెరిగిందో తెలుసా?