Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమరావతికి రైల్వే లైను లేనట్లే!

Advertiesment
అమరావతికి రైల్వే లైను లేనట్లే!
, సోమవారం, 21 సెప్టెంబరు 2020 (07:51 IST)
ఏపీ రాజధాని అమరావతికి నూతన రైల్వే లైను నిర్మాణం లేనట్లే కనిపిస్తోంది. ఆదివారం ప్రభుత్వ హామీల పార్లమెంటరీ స్థాయీ సంఘం పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో ఈ విషయంలో వెల్లడైంది.

రాజధానికి రైల్వే కనెక్టివిటీ కల్పించడంలో భాగంగా 2016-17 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం విజయవాడ నుంచి గుంటూరు వయా అమరావతి (67 కిలోమీటర్లు) కొత్త లైనును ప్రకటించింది. అందుకు సంబంధించిన సర్వే కోసం 2016లో రూ.7 లక్షలు కేటాయించింది.

దీన్ని ఒక హామీగా పరిగణించిన ప్రభుత్వ హామీల పార్లమెంటరీ స్థాయీ సంఘం.. ఈ ప్రాజెక్టు పురోగతిపై అధ్యయనం ప్రారంభించింది. కాగా, ఈ ప్రాజెక్టును హామీల జాబితా నుంచి తొలగించాలని కమిటీని రైల్వే శాఖ విజ్ఞప్తి చేసింది.

సర్వే నిర్వహించడం అంటే ప్రాజెక్టును మంజూరు చేస్తామన్నట్లు కాదని, సర్వే  ఆధారంగా ప్రాజెక్టును మంజూరు చేయాలా వద్దా అని నిర్ణయిస్తామని తెలిపింది. అనంతరం ఈ అంశాన్ని కమిటీ తన అధ్యయనం నుంచి తొలగించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమెరికా ఎన్నికల ఎఫెక్ట్: మళ్లీ ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు