Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమరావతి రైతులకు మద్ధతుగా రానున్న కువైట్ బృందం

Advertiesment
అమరావతి రైతులకు మద్ధతుగా రానున్న కువైట్ బృందం
, గురువారం, 27 ఆగస్టు 2020 (18:42 IST)
అమరావతి రాజధాని రైతులకు మద్ధతుగా కువైట్ లో గురువారం ఆందోళన నిర్వహించినట్లు కువైట్ తెలుగు పరిరక్షణ సమితి నాయకులు ఓలేటి దివాకర్ తెలిపారు.

అనంతరం రాజధాని రైతులు 254వ రోజులుగా చేస్తున్న దీక్షలకు సంఘీభావంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించినట్లు పేర్కొన్నారు. 

అమరావతి జేఏసీకి అన్ని వేళలా తమ సంపూర్ణ మద్ధతు ఉంటుందని స్పష్టం చేశారు. రైతుల సమస్యల పట్ల ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు.  త్వరలోనే అమరావతిలో పర్యటించి రైతులు చేస్తున్న పోరాటానికి మద్ధతు తెలుపుతామని ప్రకటించారు.

రాజధాని కోసం ఉచితంగా భూములిచ్చిన రైతులను ప్రభుత్వం కన్నీరు పెట్టిస్తోందని  ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీకి పెట్టుబడులు రావాలంటే అమరావతినే రాజధానిగా కొనసాగించాలని సూచించారు.

దేశానికి అన్నం పెట్టే రైతులతో కన్నీరు పెట్టించడం రాష్ట్రానికి మంచిదికాదని పేర్కొన్నారు. పెన్షన్ అడిగిన మహిళలను కాళ్లతో తన్నడం  బాధాకరమని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చౌక ధరలో రెడ్ మీ ఫోన్లు... ఆగస్టు 31 నుంచి అమ్మకాలు