Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రివర్ బోటింగ్ అడ్వంచర్ సంస్థకు మంత్రి అఖిలప్రియ అనుచరులకు లింకులున్నాయా?

క్రిష్ణానదిలో పడవ ప్రమాదం జరిగి 16 మంది ప్రాణాలు కోల్పేయిన విషయం తెలిసిందే. ఇప్పటికే 9 మంది కనిపించకుండా పోయారు. కనిపించకుండాపోయిన తమవారి కోసం బంధువులు ఎదురుచూస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా రివర్ బోటింగ్ అడ్వంచర్ సంస్థ పడవలను నదిలో నడపడమే ప్రమాద

రివర్ బోటింగ్ అడ్వంచర్ సంస్థకు మంత్రి అఖిలప్రియ అనుచరులకు లింకులున్నాయా?
, సోమవారం, 13 నవంబరు 2017 (19:05 IST)
క్రిష్ణానదిలో పడవ ప్రమాదం జరిగి 16 మంది ప్రాణాలు కోల్పేయిన విషయం తెలిసిందే. ఇప్పటికే 9 మంది కనిపించకుండా పోయారు. కనిపించకుండాపోయిన తమవారి కోసం బంధువులు ఎదురుచూస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా రివర్ బోటింగ్ అడ్వంచర్ సంస్థ పడవలను నదిలో నడపడమే ప్రమాదానికి కారణమని పోలీసులు నిర్థారణకు వచ్చారు. 
 
అంతేకాదు 35 మందిని మాత్రమే ఎక్కించాల్సిన పడవలో 40 మందిని ఎక్కించడం, సేఫ్ జాకెట్స్ పర్యాటకులు అడిగినా ఇవ్వకపోవడంతో చాలామంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. దీనిపై వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించి సంఘటన ఎలా జరిగిందో వివరాలను ఆరా తీయాలని పర్యాటక శాఖామంత్రి అఖిలప్రియను ఆదేశించారు.
 
భూమా అఖిల ప్రియ వెంటనే ప్రమాదంపై పర్యాటక శాఖ అధికారులను ఆరా తీశారు. రివర్ బోటింగ్ అడ్వంచర్ సంస్థకు చెందిన కొండలరావు అనే వ్యక్తి అధికార తెలుగుదేశం పార్టీకి బాగా కావాల్సిన వ్యక్తి అని తేలింది. ఈయనకు భూమా అఖిలప్రియకు చెందిన కొంతమంది అనుచరులతో మంచి సంబంధాలే ఉన్నాయని సమాచారం. దీంతో ఆ విషయాన్ని మంత్రి దృష్టి తీసుకెళ్ళారట అఖిలప్రియ సన్నిహితులు. 
 
16 మంది మరణించిన తరువాత పూర్తిస్థాయిలో విచారణ తప్పదు కనుక తప్పు చేసినవారు ఎవరయినా తప్పదని మంత్రి వారికి చెప్పినట్లు సమాచారం. దీంతో ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక కొండలరావు ఆలోచనలో పడిపోయారట.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉద్ధానం తర్వాత కనిగిరిలోనే ఆ సమస్య ఎక్కువ... ఎమ్మెల్యే కదిరి బాబురావు