Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రోజాకు సెల్వమణి ఫుల్ క్లాస్... ఆ విషయంపైనేనా...?

అటు రాజకీయాల్లోను.. ఇటు బుల్లితెర పైనా తనదైన శైలిలో రాణిస్తూ దూసుకుపోతున్న రోజాను అడ్డుకునేవారు ఎవరూ లేరనుకున్నారు. అటు వైసిపిలో గాని, లేకుంటే ప్రతిపక్ష పార్టీ నేతలు గాని, లేకుంటే సినీపరిశ్రమ నుంచి గాని రోజాను తీవ్రస్థాయిలో విమర్శించే వ్యక్తి అస్సలు

Advertiesment
రోజాకు సెల్వమణి ఫుల్ క్లాస్... ఆ విషయంపైనేనా...?
, శనివారం, 12 ఆగస్టు 2017 (18:51 IST)
అటు రాజకీయాల్లోను.. ఇటు బుల్లితెర పైనా తనదైన శైలిలో రాణిస్తూ దూసుకుపోతున్న రోజాను అడ్డుకునేవారు ఎవరూ లేరనుకున్నారు. అటు వైసిపిలో గాని, లేకుంటే ప్రతిపక్ష పార్టీ నేతలు గాని, లేకుంటే సినీపరిశ్రమ నుంచి గాని రోజాను తీవ్రస్థాయిలో విమర్శించే వ్యక్తి అస్సలు లేరనేది అందరి భావన. కానీ రోజా నోటికి తాళాలు వేసే పనిలో పడ్డారట ఆమె భర్త సెల్వమణి. నోరు తెరిస్తే డబుల్ మీనింగ్ డైలాగులు.. ఏదిపడితే అది మాట్లాడేయడం రోజాకు అలవాటు. ఇది కాస్త సెల్వమణికి అస్సలు ఇష్టం లేదు.
 
దర్శకుడిగా ఉన్న సెల్వమణి, రోజాలు ప్రేమించే పెళ్ళి చేసుకున్నారు. ఇద్దరి మధ్య ఎప్పుడూ బేధాభిప్రాయాలు వచ్చిన సంధర్భాలు లేవట. కానీ గత కొన్నిరోజులుగా ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఏ కార్యక్రమానికి వెళ్ళినా సెల్వమణిని కొంతమంది ప్రశ్నిస్తున్నారట. మీరు ఎందుకు మీ భార్యను అదుపులో పెట్టుకోవడం లేదని.. ఎవరు స్వేచ్ఛ వారిది. దానిని మనం ప్రశ్నించకూడదని చెబుతున్నారట సెల్వమణి. అయితే నంద్యాల ఉపఎన్నికల్లో రోజా కొన్ని వ్యాఖ్యలు చేయడం తీవ్ర చర్చకు దారితీసింది. అందులోను మంత్రి అఖిలప్రియ బట్టల గురించి మాట్లాడటం మరింత వివాదాస్పమైంది.
 
అదే సెల్వమణికి అస్సలు నచ్చలేదట. కొన్నిరోజులుగా రోజాను ప్రశ్నిస్తూ ఉన్నారట. ఇలాంటివి దయచేసి ఇప్పటికైనా మానుకో... అలా మాట్లాడితే మన విలువను మనమే తగ్గించుకున్న వారమవుతామని చెప్పారట సెల్వమణి. అది కూడా ఘాటుగా కాకుండా సున్నితంగా రోజాకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారట. కానీ రోజా మాత్రం అందుకు ఏమాత్రం ఒప్పుకోలేదని తెలుస్తోంది. ఫైర్ బ్రాండ్‌గా ఉన్న రోజా, భర్త ఇచ్చిన క్లాస్‌తో సైలెంట్ అవుతారా.. లేక గత పంథాలోనే కొనసాగుతారా అన్నది వేచి చూడాల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పదేళ్ల బాలికను గర్భవతిని చేశాడు.. లావుగా ఉండటంతో 8 నెలల గర్భమని..?