ఏపీలో నిరుద్యోగులకు సీఎం జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా సొసైటీ వారి నుంచి ఈ నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం 1358 టీచర్ ప్రిన్సిపాల్, పీజీటీ, సీఆర్టీ, పీఈటీ ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేశారు. అయితే.. కాంట్రాక్ట్ విధానంలో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.
ఈ ఉద్యోగాలకు 18-42 ఏళ్లను వయో పరిమితిగా విధించారు. వివిధ వర్గాల వారికి వయో పరిమితిలో సడలింపు ఇచ్చారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మే 29 నుంచి ప్రారంభం కానుంది. దరఖాస్తు చేసుకోవడానికి జూన్ 4ను ఆఖరి తేదీగా నిర్ణయించారు.