Publish Date: Wed, 17 May 2023 (13:27 IST)
Updated Date: Wed, 17 May 2023 (13:28 IST)
తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ పదో తరగతి సిప్లమెంటరీ పరీక్షలకు సంబంధించిన టైమ్ టేబుల్‌ను మంగళవారం రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం జూన్ 14వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఈ పరీక్షలను నిర్వహిస్తారు. ఆయా పరీక్షల తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. ప్రతి పరీక్షకు 3.30 గంటల పాటు పరీక్ష రాసే సమయాన్ని కేటాయించారు.
టెన్త్ అకడమిక్ ప్రోగ్రాం, ఓరియంటల్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ కోర్సులోని అన్ని సబ్జెక్టులకు ఆబ్జెక్టివ్ పేపర్ ప్రశ్నపత్రానికి చివరి అరగంటలో జవాబులు రాయాల్సివుంటుంది. ఇది రెండు విద్యా కోర్సులకు వర్తిస్తుంది. ఈ టైమ్ టేబుల్ ప్రకారం ప్రభుత్వ సెలవులు, సాధారణ సెలవులు వచ్చినప్పటికీ ఆయా తేదీల్లో మాత్ర పరీక్షలను నిర్వహించి తీరాల్సిందేనని విద్యాశాఖ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది.