Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జూన్ 6న తిరుపతి లో ఆదిపురుష్‌ ప్రీ రిలీజ్, జూన్ 16న 70 దేశాల్లో సినిమా

Advertiesment
adipurush poster
, గురువారం, 25 మే 2023 (12:05 IST)
adipurush poster
ప్యాన్ ఇండియన్ సూపర్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ ఆదిపురుష్‌. ఓమ్ రౌత్ డైరెక్షన్ లోరూపొందిన ఈ చిత్రాన్ని రామాయణ ఇతిహాసంలోని ఓ ఘట్టంగా తెరకెక్కించారు. ప్రభాస్ రాఘవుడుగా, కృతి సనన్ సీతగా నటించిన ఈ చిత్రంలో సన్ని సింగ్ హనుమంతుడుగా, సైఫ్ అలీఖాన్ రావణుడు పాత్రల్లో నటించారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా మోస్ట్ అవెయిటెడ్ అనిపించుకున్న ఈ మూవీ ట్రైలర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఓ గొప్ప కథను వెండితెరపై చూడబోతున్నాం అనే ఆసక్తిని అందరిలోనూ క్రియేట్ చేసింది ఆదిపురుష్‌.
 
జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా 70 దేశాల్లో భారీ స్థాయిలో విడుదల కాబోతోన్న ఆదిపురుష్‌ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వేదిక సిద్ధమైంది. జూన్ 6న తిరుపతిలో అత్యంత వైభవంగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకను నిర్వహించబోతున్నారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా మరికొన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్స్ జరగనున్నా .. శ్రీ వెంకటేశ్వరుడు కొలువైన తిరుపతి క్షేత్రంలో ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగడం చారిత్రాత్మకంగా చెప్పొచ్చు. ఇందుకోసం ఇప్పటి నుంచే ఏర్పాట్లు మొదలుపెట్టారు.
 
ప్రభాస్, కృతిసనన్, సైఫ్ అలీఖాన్, సన్నీ సింగ్, దేవదత్త నాగే, వత్సల్ సేన్, సోనాల్ చౌహాన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఆదిపురుష్‌ జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఓ మహిళ, ఆమె భర్త చుట్టూ జరిగే సంఘటనతో ది ట్రయల్ చిత్రం