సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2, 2025 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించింది. సెప్టెంబర్ 22 నుండి సెలవులు ప్రకటించాలని ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూ టీడీఎల్పీ గ్రాడ్యుయేట్ల ఎమ్మెల్సీల ద్వారా ఉపాధ్యాయులు విజ్ఞప్తి చేశారుని తెలిపారు. విద్యా శాఖ అధికారులతో చర్చల తర్వాత, దసరా పండుగకు సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2 వరకు సెలవులు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కాగా దసరా సెలవుల్ని మరో రెండు రోజులు పెంచారని మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. పాఠశాలలకు దసరా సెలవులు ఈ నెల 22 నుండి ఇవ్వాలని ఉపాధ్యాయులు కోరుతున్నారని టీడీపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు నా దృష్టికి తీసుకొచ్చారు. వారి కోరిక మేరకు విద్యా శాఖ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకున్నాం. ఈ నెల 22 నుండి అక్టోబర్ 2 వరకూ దసరా పండుగ సెలవులు ఇవ్వాలని నిర్ణయించాం.. అంటూ మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు.
తెలంగాణలో సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 3 వరకు దసరా సెలవుల్ని ప్రకటించారు. అక్కడ మొత్తం 13 రోజుల పాటూ దసరా సెలవులు ఇచ్చారు. అంటే అక్టోబర్ 4 నుంచి స్కూల్స్ ప్రారంభమవుతాయి.