Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

19-09-2025 శుక్రవారం ఫలితాలు - రావలసిన ధనం అందుతుంది.. ఖర్చులు సామాన్యం...

Advertiesment
astro5

రామన్

, శుక్రవారం, 19 సెప్టెంబరు 2025 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు సామాన్యం. కొత్తవ్యక్తులతో మితంగా సంభాషించండి. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. ఆప్తులకు ముఖ్య సమాచారం అందిస్తారు. బెట్టింగ్లకు పాల్పడవద్దు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
అనుకున్న లక్ష్యం సాధిస్తారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. మనోధైర్యంతో యత్నాలు సాగించండి. అనవసర జోక్యం తగదు. కొన్ని విషయాలు చూసీ చూడనట్టు వదిలేయండి.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఖర్చులు విపరీతం. నిస్తేజానికి లోనవుతారు. రుణసమస్య మనశ్శాంతి లేకుండా చేస్తుంది. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. నగదు, కీలక పత్రాలు జాగ్రత్త. ఆత్మీయులతో సంభాషిస్తారు. ప్రయాణం విరమించుకుంటారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
వివాహ యత్నాలు మొదలెడతారు. వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. తొందరపడి హామీలివ్వవద్దు. పెద్దల సలహా పాటించండి. పనులు ఒకపట్టాన సాగవు. పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం ఉత్తేజపరుస్తుంది. పాత పరిచయస్తులను కలుసుకుంటారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. మాట నిలబెట్టుకుంటారు. దుబారా ఖర్చులు విపరీతం. చెల్లింపుల్లో జాప్యం తగదు. పనుల ప్రారంభంలో అవాంతరాలెదురవుతాయి. సన్నిహితులకు ముఖ్య సమాచారం అందిస్తారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
సమర్ధతను చాటుకుంటారు. అవకాశం కలిసివస్తుంది. కొత్తయత్నాలు మొదలెడతారు. ఖర్చులు అదుపులో ఉండవు. పనులు వేగవంతమవుతాయి. వాగ్వాదాలకు దిగవద్దు. ఎదుటివారి అభిప్రాయంతో ఏకీభవించండి. కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
రావలసిన ధనం అందుతుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. మీ సాయంతో ఒకరికి లబ్ధి కలుగుతుంది. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. అనుకోని సంఘటన ఎదురవుతుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఖర్చులు సామాన్యం. పత్రాల రెన్యువల్లో మెలకువ వహించండి. పనులు వాయిదా పడతాయి. ఫోన్ సందేశాలను నమ్మవద్దు. సన్నిహితుల సలహా పాటించండి. వేడుకకు హాజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి. స్వల్ప అస్వస్థతకు గురవుతారు.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఖర్చులు అధికం. కొంతమొత్తం పొదుపు చేయగల్గుతారు. పరిచయాలు బలపడతాయి. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. అప్రియమైన వార్త వినవలసి వస్తుంది. ప్రముఖులను కలుసుకుంటారు. పుణ్యకార్యంలో వీపాల్గొంటారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
పరిస్థితులకు అనుగుణంగా మెలగండి. ఏది జరిగినా ఒకందుకు మంచిదే. యత్నాలు విరమించుకోవద్దు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. చేపట్టిన పనులు ముందుకు సాగవు. చీటికిమాటికి చిరాకుపడుతుంటారు. ఆప్తులతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
సంతోషకరమైన వార్త వింటారు. మీ శ్రమ ఫలిస్తుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. వస్తులాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఖర్చులు సామాన్యం. పనులు సాగవు. సభ్యత్వాలు స్వీకరిస్తారు. వ్యతిరేకులతో జాగ్రత్త. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ప్రణాళికలు వేసుకుంటారు. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఏజెన్సీలను ఆశ్రయించవద్దు. నిలిపివేసిన పనులు పూర్తిచేస్తారు. ఒక సంఘటన మీపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. వాహనదారులకు దూకుడు తగదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

18-09-2025 గురువారం ఫలితాలు - దంపతుల మధ్య ఏకాగ్రత నెలకొంటుంది...