Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

17-09-2025 బుధవారం ఫలితాలు - పనులు అర్ధాంతంగా ముగించవలసి వస్తుంది...

Advertiesment
astro3

రామన్

, బుధవారం, 17 సెప్టెంబరు 2025 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం 
ప్రతిభను చాటుకుంటారు. ఖర్చులు విపరీతం. ఆప్తులతో సంభాషిస్తారు. గృహోపకరణాలు మరమ్మతుకు గురవుతాయి. పనులు మొక్కుబడిగా పూర్తిచేస్తారు. ఊహించని సమస్య ఎదురవుతుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. ప్రయాణం చికాకుపరుస్తుంది. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
కొత్త యత్నాలు చేపడతారు. ఖర్చులు అధికం. పనులు అర్ధాంతంగా ముగించవలసి వస్తుంది. కొత్తవ్యక్తులతో జాగ్రత్త. వాగ్వాదాలకు దిగవవద్దు. ఆరోగ్యం బాగుంటుంది. పాత పరిచయస్తులను కలుసుకుంటారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దైవదీక్షలు స్వీకరిస్తారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఆశావహదృక్పధంతో మెలగండి. అపజయాలకు కుంగిపోవద్దు. అయిన వారు మీ అశక్తతను అర్ధం చేసుకుంటారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. సన్నిహితుల వ్యాఖ్యలు ఉత్సాహపరుస్తాయి. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. అపరిచితులను నమ్మవద్దు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ప్రముఖులతో పరిచయమేర్పడుతుంది. ఉల్లాసంగా గడుపుతారు. వ్యాపకాలు అధికమవుతాయి. ఆప్తులకు ముఖ్య సమాచారం అందిస్తారు. పనులు వేగవంతమవుతాయి. అనవసర జోక్యం తగదు. మితంగా సంభాషించండి. పందాలు, బెట్టింగులకు పాల్పడవద్దు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఖర్చులు విపరీతం. అవసరానికి ధనం సర్దుబాటవుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మీ జోక్యం అనివార్యం. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. పత్రాల రెన్యువల్లో జాప్యం తగదు. మీ అలక్ష్యం ఇబ్బంది కలిగిస్తుంది. దైవదర్శనాలు సంతృప్తినిస్తాయి. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
వ్యవహారాలతో తీరిక ఉండదు. ఆలోచనలతో సతమతమవుతారు. ఖర్చులు విపరీతం. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఇంటి విషయాలపై దృష్టి పెడతారు. పనులు ముందుకు సాగవు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
లావాదేవీలు ముగుస్తాయి. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఖర్చులు అధికం. సంతృప్తికరం. కీలక పత్రాలు అందుతాయి. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. వ్యాపకాలు అధికమవుతాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. అనవసర జోక్యం తగదు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఆశావహదృక్పథంతో మెలగండి. యత్నాలు విరమించుకోవద్దు. పనుల సానుకూలతకు ఓర్పుతో శ్రమించాలి. స్థిరాస్తి ధనం అందుకుంటారు. ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు. అపరిచితులతో జాగ్రత్త. విదేశాల నుంచి సంతానం రాక ఉత్సాహాన్నిస్తుంది.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
వ్యవహారదక్షతతో నెట్టుకొస్తారు. పదవులు, బాధ్యతలు స్వీకరిస్తారు. వ్యతిరేకులు చేరువవుతారు. రుణ సమస్యలు కొలిక్కి వస్తాయి. చెల్లింపుల్లో జాగ్రత్త. ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఆత్మీయులను కలుసుకుంటారు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
మనోధైర్యంతో యత్నాలు సాగించండి. పరిచయుల వ్యాఖ్యలు ఆలోచింపచేస్తాయి. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. మీ కష్టం వెంటనే ఫలిస్తుంది. దంపతుల మధ్య దాపరికం తగదు. స్థిరాస్తి వ్యవహారంలో జాగ్రత్త. సన్నిహితులను విందుకు ఆహ్వానిస్తారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఈ రోజు యోగదాయకం. వస్తులాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. చిత్తశుద్ధిని చాటుకుంటారు. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు విపరీతం, పర్మిట్లు, లైసెన్సులు మంజూరవుతాయి. ప్రయాణం చికాకుపరుస్తుంది.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
మాటతీరు ఆకట్టుకుంటుంది. పరిచయాలు బలపడతాయి. విలాసాలకు వ్యయం చేస్తారు. పనులు ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. కుటుంబీకుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. వేడుకకు హాజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కార్తీక మహోత్సవం ఉత్సవాలకు సిద్ధమవుతున్న శ్రీశైలం.. విస్తృత ఏర్పాట్లు