Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీ సర్కారు కీలక నిర్ణయం: ఇకపై ఆసుపత్రుల్లో హెపటైటిస్ వైద్యం

Advertiesment
ఏపీ సర్కారు కీలక నిర్ణయం: ఇకపై ఆసుపత్రుల్లో హెపటైటిస్ వైద్యం
, గురువారం, 10 మార్చి 2022 (18:22 IST)
ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇకపై రాష్ట్రంలోని అన్ని జిల్లా ఆస్పత్రుల్లో హైప‌టైటిస్‌కు వైద్యం అందించాలని ఏపీ సర్కారు నిర్ణయించింది.
 
ఏపీలో హెపటైటిస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయని గుర్తించిన వైద్యారోగ్యశాఖ.. బాధితులకు సత్వర వైద్యం అందేలా చర్యలు ప్రారంభించింది. ఈ క్రమంలోనే ఇకపై అన్ని జిల్లా ఆసుపత్రుల్లో హెపటైటిస్‌కు వైద్యం అందించాలని నిర్ణయించారు.
 
ఇప్పటివరకు రాష్ట్రంలోని 11 బోధనాసుపత్రులు, 2 జిల్లా ఆసుపత్రుల్లో హెపటైటిస్‌కు సంబంధించిన వ్యాధులకు స్క్రీనింగ్‌తో పాటు వైద్యాన్ని అందిస్తున్నారు. 
 
తాజా ఆదేశాలతో రాష్ట్రంలోని మొత్తం 26 ఆసుపత్రుల్లో హెపటైటిస్ బీ, సీ వ్యాధిగ్రస్తులకు వైద్యం అందనుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుపతి శ్రీనివాస సేతుపై యువత పిచ్చిచేష్టలు... పిల్లిమొగ్గలు