Publish Date: Sat, 04 Jun 2022 (12:12 IST)
Updated Date: Sat, 04 Jun 2022 (12:15 IST)
పదో తరగతి పరీక్షల ఫలితాల విడుదల సోమవారానికి వాయిదా పడింది. అనివార్య కారణాల వల్ల ఫలితాల విడుదలను సోమవారానికి వాయిదా వేస్తున్నట్టు అధికారులు తెలిపారు. షెడ్యూల్ ప్రకారం ఈరోజు ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల కావాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో పరీక్ష ఫలితాలను సోమవారం విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సమక్షంలో ఫలితాలు విడుదలవుతాయని చెప్పారు.
ఫలితాల విడుదల వాయిదా పడటానికి కారణం ఏమిటనేది వెల్లడి కానప్పటికీ... సాంకేతిక కారణాల వల్లే వాయిదా పడినట్టు తెలుస్తోంది.
ఏపీలో 6,21,799 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,776 కేంద్రాల్లో పరీక్షలను నిర్వహించారు. ఈ సారి గ్రేడింగ్ రూపంలో కాకుండా, మార్కుల రూపంలో ఫలితాలను వెల్లడించనున్నారు.