Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అంతర్వేది నరసింహ స్వామికి కోటి రూపాయలతో నూతన రథం

అంతర్వేది నరసింహ స్వామికి కోటి రూపాయలతో నూతన రథం
, శనివారం, 19 సెప్టెంబరు 2020 (21:09 IST)
అంతర్వేదిలో దగ్థమైన రథం నేపథ్యంలో నూతన రథం నిర్మాణ పనులు  ప్రారంభమయ్యాయి. దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో కొత్త రథం నూతన ఆకృతి నిర్మాణానికి వేగవంతంగా కార్యాచరణ జరుగుతోంది. కొత్త  ఆకృతి ప్రకారం నూతన రథానికి కోటి వ్యయం దాటవచ్చని అంచనా. మూడు నెలల్లోగా నూతన రథం తయారుచేయాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు.
 
నూతర రథం నిర్మాణం కోసం 21 అడుగులు పొడవు, 6 అడుగుల చుట్టు కొలతలు కలిగిన వందేళ్లు పైబడిన నాణ్యమైన బస్తర్ టేకును ఉపయోగిస్తున్నారు. ముహూర్తం ప్రకారం పూజా కార్యక్రమాలతో 
అంతర్వేది ప్రత్యేక అధికారి రామచంద్ర మోహన్ కర్ర కోతతో నూతన రథం నిర్మాణ పనులు ప్రారంభించారు. ప్రభుత్వ నిధులతో కొత్త  రథం నిర్మాణం చేపడుతున్నారు.
 
2021 ఫిబ్రవరిలో స్వామి కల్యాణోత్సవాలు నాటికి రథం సిద్ధం చేయడానికి కసరత్తు చేస్తున్నారు. కొత్త రథాన్ని శిఖరంతో కలిపి 41 అడుగుల ఎత్తు వచ్చేలా చేసిన ఆకృతి ప్రకారమే రథం నిర్మాణం చేపడుతున్నారు. ఆరు చక్రాలతో కూడిన రథం మొత్తాన్ని ఏడు అంతస్తుల్లా నిర్మాణం చేయనున్నారు. పాత రథానికి వాడిన టేకు స్వచ్ఛమైన బర్మా కలప, మళ్లీ అదే కలపతో కొత్త రథం తయారు చేయిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమరావతి రాజధాని అంశంలో కేంద్రం జోక్యం చేసుకోవాలి: గల్లా జయదేవ్