Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కంచ ఐలయ్య డేరా బాబాకంటే పెద్ద ద్రోహి : సినీనటి కవిత

‘సామాజిక స్మ‌గ్ల‌ర్లు కోమ‌టోళ్లు’ అంటూ పుస్త‌కం రాసిన ప్రముఖ రచయిత, ఆచార్య కంచ ఐల‌య్యపై సినీ నటి కవిత మండిపడ్డారు. ఇదే అంశంపై ఆదివారం హైదరాబాద్‌లోని ఆర్యవైశ్య మహాసభ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఇందు

Advertiesment
కంచ ఐలయ్య డేరా బాబాకంటే పెద్ద ద్రోహి : సినీనటి కవిత
, ఆదివారం, 17 సెప్టెంబరు 2017 (15:02 IST)
‘సామాజిక స్మ‌గ్ల‌ర్లు కోమ‌టోళ్లు’ అంటూ పుస్త‌కం రాసిన ప్రముఖ రచయిత, ఆచార్య కంచ ఐల‌య్యపై సినీ నటి కవిత మండిపడ్డారు. ఇదే అంశంపై ఆదివారం హైదరాబాద్‌లోని ఆర్యవైశ్య మహాసభ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఇందులో ప్ర‌ముఖులు త‌మ అభిప్రాయాలను వ్య‌క్తం చేస్తూ కంచ ఐల‌య్య‌పై తీవ్రస్థాయిలో మండిప‌డ్డారు. 
 
ఈ సమావేశంలో పాల్గొన్న‌ సినీనటి కవిత మాట్లాడుతూ.. కంచ ఐలయ్య డేరా బాబాకంటే పెద్ద ద్రోహి అని మండిపడ్డారు. ఆర్య‌వైశ్యులను అవ‌మాన‌ప‌ర్చిన ఐలయ్యకు తగిన రీతిలో బుద్ధి చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. 
 
ఈ విష‌యంపై  ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించి ఐల‌య్య‌పై త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. ఆర్య‌వైశ్యులు ఎన్నో సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తార‌ని, అటువంటి వారిపై ఇటువంటి వ్యాఖ్య‌లు చేయ‌డం స‌రికాద‌ని ఆమె ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  
 
కాగా, ‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు' అంటూ పుస్తకం రాసిన ప్రొ.కంచ ఐల‌య్యకు ఆదివారం వ‌రంగ‌ల్‌లో ఆఫీస‌ర్స్ ఫోరం స‌న్మానం చేసింది. ఈ సంద‌ర్భంగా జరిగిన ర్యాలీలో ఐల‌య్య మాట్లాడుతూ.. తాను ఇంత చిన్న పుస్త‌కం రాయ‌డంతోనే వారి జాతిని అవ‌మానించాన‌ని అంటున్నార‌ని మండిప‌డ్డారు. త‌మ‌ను అవ‌మానించిన అగ్ర‌కులాల వారిని తాను రోడ్ల‌పైకి తెచ్చినందుకే త‌న‌కు ఈ రోజు స‌న్మానం చేశార‌ని చమత్కరించారు.
 
కింది కులాల వారిని అవ‌మానించబోమ‌ని, తిట్ట‌బోమ‌ని అగ్ర‌కులాల వారు చెప్పి, తన డిమాండ్ల‌ను ఒప్పుకుంటే తాను రాసిన పుస్త‌కాన్ని తానే హైద‌రాబాద్‌లోని సుంద‌ర‌య్య విజ్ఞాన కేంద్రంలో బ‌హిరంగంగా త‌గ‌ల‌బెడ‌తాన‌న్నారు. 
 
బ్రాహ్మ‌ణులు రాసుకున్న పుస్తకాల‌లో కిందికులాల వారిని చండాలురు, శూద్రులు, దుర్మార్గులు, జ్ఞానం లేని వారు అని ఎన్నో ర‌కాలుగా తిట్టార‌ని, ఇప్పుడు తాను రాసుకున్న పుస్త‌కంపై ఇంతగా ఎందుకు మండిప‌డుతున్నార‌ని ఆయ‌న నిలదీశారు. చాక‌లోడు, మంగ‌లోడు, ద‌ళితుడు అని తిట్టిన‌ అగ్ర‌కులాల అహంకారం గురించి ఎవరూ మాట్లాడ‌రేంట‌ని ప్రశ్నించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇది చూస్తే రెండు చేతులెత్తి శ్రీవారికి నమస్కరిస్తాం!