అసెంబ్లీ ప్రివిలైజ్ కమిటీ సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. సీఎం జగన్‌మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా దూషించారనే కారణంతో టీడీపీ శాసనసభాపక్ష ఉపనేతలు అచ్చెన్నాయుడు, రామానాయుడుకు ఈ అసెంబ్లీ సమావేశాలు జరిగినన్ని రోజులూ.. మైక్ ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్నారు.
ఈ ప్రతిపాదనలను ప్రివిలైజ్ కమిటీ సభ్యుడు అనగాని సత్యప్రసాద్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయన మాట్లాడుతూ రామానాయుడిని సీఎం.. డ్రామా నాయుడు అంటేనే తిరిగి రామానాయుడు మాట్లాడారని గుర్తు చేశారు. కావాలంటే రికార్డులను పరిశీలించుకోవాలని సూచించారు.
అచ్చెన్నాయుడు, రామానాయుడికి అసెంబ్లీ సమావేశాల్లో మైక్ ఇవ్వకూడదనే తీర్మాణాన్ని ప్రివిలైజ్ కమిటీ.. స్పీకర్‌కు పంపనుంది. అదేవిధంగా నిమ్మగడ్డ రమేష్‌కుమార్ లేఖను కమిటీ పరిశీలించింది. అలాగే కూన రవికుమార్ లేఖను కూడా పరిశీలించారు.