Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ సినిమాల స్టైల్లో గ‌ల్లీ రౌడీ ఉంటుంద‌ని పోస్ట‌ర్ల‌లో పెట్టాంః కోన వెంక‌ట్‌

Advertiesment
ఆ సినిమాల స్టైల్లో గ‌ల్లీ రౌడీ ఉంటుంద‌ని పోస్ట‌ర్ల‌లో పెట్టాంః కోన వెంక‌ట్‌
, గురువారం, 16 సెప్టెంబరు 2021 (17:12 IST)
gully rowdy prerelease
సందీప్ కిషన్, నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘గ‌ల్లీరౌడీ’. కోన వెంక‌ట్ ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హిరించ‌డ‌మే కాకుండా స్క్రీన్‌ప్లేను కూడా అందించారు. కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌, ఎంవీవీ సినిమా పతాకాలపై కోన వెంకట్‌ సమర్పణలో జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఎం.వి.వి. సత్యనారాయణ నిర్మించారు. సెప్టెంబర్ 17న సినిమా విడుదలవుతుంది. ఈ సంద‌ర్భంగా బుధ‌వారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ  కార్య‌క్ర‌మానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ స్పీక‌ర్ కోన ర‌ఘుప‌తి ముఖ్య అతిథిగా విచ్చేశారు.
 
అనంత‌రం ఆయ‌న‌ మాట్లాడుతూ, సినిమాలో అద్భుత‌మైన కామెడీ ట్రాక్ రాయ‌డంలో వెంక‌ట్‌ను మించిన‌వాడు లేడ‌ని నేను అనుకుంటాను. స‌త్య‌నారాయ‌ణ‌గారిలోనే ప్యాష‌న్ అది రాజ‌కీయ‌మైన‌, సినిమా రంగ‌మైనా ఆయ‌న టాప్‌లోనే ఉన్నారు. సందీప్‌కిష‌న్ చేసిన వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్ చూశాను. త‌ను నేచుర‌ల్ స్టార్‌. త‌న‌ని చూస్తే ధ‌నుశ్‌ను చూసిన‌ట్లు స్పార్క్ క‌నిపించింది. ట్రైల‌ర్‌, పాటలు బావున్నాయి.  సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.
 
కోన వెంక‌ట్ మాట్లాడుతూ, రాసింది భాను, నందు, తీసింది నాగేశ్వ‌ర్ రెడ్డి. కానీ పోస్ట‌ర్‌పై ఢీ, రెఢీ, దూకుడు సినిమా పేర్లు ఎందుకు పెట్టామంటే, ఆ సినిమాల స్టైల్లో ఇది కూడా ఉంటుంద‌ని చెప్ప‌డానికి మాత్ర‌మే. నేను ప‌స్ట్ టైమ్ విష్ణుతో ఢీ, రామ్‌తో రెఢీ, మ‌హేశ్‌తో దూకుడు, ఎన్టీఆర్‌తో అదుర్స్ సినిమాలు చేశాను. అన్నీ బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాలే. అలాగే ఫ‌స్ట్ టైమ్ సందీప్‌తో చేసిన గ‌ల్లీరౌడీ చిత్రానికి కూడా  అదే సెంటిమెంట్ వ‌ర్క‌వుట్ అవుతుంద‌ని న‌మ్ముతున్నాను. సినిమాకు అన్ని చ‌క్క‌గా కుదిరాయి. అంద‌రూ మంచి ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్స్ కుదిరాయని అన్నారు. 
 
హీరో సందీప్ కిష‌న్ మాట్లాడుతూ, ఏ1 ఎక్స్‌ప్రెస్‌’ త‌ర్వాత ఎక్కువ ఆలోచించ‌కుండా స‌ర‌దాగా న‌వ్వుకునే ఓ సినిమా చేయాల‌ని అనుకుంటున్న స‌మ‌యంలో `వివాహ భోజ‌నంబు` సినిమాను రూపొందించిన భాను, సాయి, గ‌ల్లీ రౌడీ క‌థ‌తో నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చారు. వాళ్లు మ‌రో సినిమా డైరెక్ట్ చేస్తున్నారు. అప్పుడు ఆ క‌థ‌న‌ను నాగేశ్వ‌ర్ రెడ్డిగారి ద‌గ్గ‌ర‌కు పంపాను. ఆయ‌న‌కు న‌చ్చింది. సినిమా చేద్దామని అన్నారు. అక్క‌డ నుంచి కోన‌గారి ద‌గ్గ‌ర‌కు క‌థ వెళ్లింది. రాజేంద్ర‌ప్ర‌సాద్‌గారు, బాబీసింహ‌గారు, క‌ల్ప‌ల‌త‌గారు, నిజాయ‌తీగా అంద‌ర్నీ న‌వ్వించ‌డానికి చేసిన ప్ర‌య‌త్న‌మే గ‌ల్లీరౌడీ. ఓ క్రైమ్ కామెడీని ఫ్యామిలీ జోన‌ర్‌లో తీస్తే ఎలా ఉంటుందో అనేదే సినిమా. హీరోయిన్ నేహాశెట్టి రోల్ చాలా ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉంటుంది. సాయికార్తీక్‌తో నేను చేసిన మూడో సినిమా. మీరు థియేట‌ర్స్‌కు వెళ్లి టిక్కెట్టు కొనుక్కుని సినిమా చూసిన‌ప్పుడు, అందులో రూపాయో, పైసానో మా మెతుకుపై మీ పేరు ఉంటుంది. మీరు సినిమా చూడ‌ట‌మే నాకు ముఖ్యం. థియేట‌ర్స్‌లో సినిమాను చూసి ఎంజాయ్ చేయండి’’ అన్నారు. 
 
చిత్ర నిర్మాత ఎం.వి.వి.స‌త్యనారాయ‌ణ మాట్లాడుతూ, రాజ‌కీయాల్లో ఉండ‌టం వ‌ల్ల కొన్ని రోజుల పాటు సినిమా నిర్మాణానికి దూరం అయ్యాను. ఆ స‌మ‌యంలో ఓ రోజు కోన వెంక‌ట్‌గారు ఫోన్ చేసి, మంచి క‌థ ఉంది. విన‌మ‌ని క‌థ‌ను వినిపించారు. క‌థ వినే స‌మయంలో బాగా ఎంజాయ్ చేశాను. నా స్నేహితుడు జి.వికి క‌థ‌ను వినిపించాను. ఆయ‌న‌కు కూడా బాగా న‌చ్చింది. సినిమా చేద్దామ‌ని కోన వెంక‌ట్‌గారితో చెప్పాం. ఎక్కువ టైమ్ తీసుకోకుండానే సినిమా షూటింగ్‌ను స్టార్ట్ చేశాం. అర‌వై రోజుల్లో సింగిల్ షెడ్యూల్‌లో సినిమా షూటింగ్‌ను పూర్తి చేశాం. ఈ సినిమా మా అంచ‌నాల‌కు రీచ్ కాక‌పోతే, నెక్ట్స్ సినిమా చేయ‌ను అని చెప్ప‌గ‌ల‌ను అనేంత కాన్ఫిడెన్స్‌ను ఇచ్చిన సినిమా ఇది’’ అన్నారు.
 
నటకిరిటీ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ‘‘ ప్యాండమిక్ పరిస్థితుల్లో అంద‌రూ దాదాపు ఆరు నెల‌ల పాటు ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. జీవితంలో ఎలా జాగ్ర‌త్త‌గా ఉండాలనే విష‌యాల‌ను కూడా కోవిడ్ ద్వారా నేర్చుకున్నాం. క‌రోనా వ‌ల్ల ప్ర‌పంచం దెబ్బ తింది. ఈ నేప‌థ్యంలో సినిమా ఇండ‌స్ట్రీ కూడా దెబ్బ‌తింది. ఇలాంటి కోవిడ్ సిట్యువేష‌న్స్‌లో గ‌ల్లీ రౌడీ సినిమాను ఎందుకు చూడాలనే ప్ర‌శ్న వ‌స్తుంది. ఈ క‌థ‌ను సందీప్ కిష‌నే తెచ్చుకున్నాడు. అదొక మంచి విష‌యం. అలాగే కుటుంబం అంతా క‌లిసి చూసేలా సినిమా ఉంటుంది అన్నారు. 
 
ఇంకా విష్వ‌క్ సేన్, సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ, ద‌ర్శ‌కులు శ్రీవాస్, బుచ్చిబాబు, శివ నిర్వాణ, మ్యూజిక్ డైరెక్టర్ సాయికార్తీక్ మాట్లాడుతూ సినిమా విజ‌య‌వంతం కావాల‌ని ఆకాంక్షించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చావును దగ్గరనుంచి చూశా, దాన్నుంచి చాలా నేర్చుకున్నాః శశి ప్రీతమ్