Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సింహాచలంలో 25 ఏళ్ల కిందటి పాత ట్రాన్స్‌ఫార్మర్ పేలింది

సింహాచలంలో 25 ఏళ్ల కిందటి పాత ట్రాన్స్‌ఫార్మర్ పేలింది
, గురువారం, 27 మే 2021 (09:22 IST)
సింహాచలంలో గురువారం తెల్లవారుజామున 3 గంటలకు ట్రాన్స్ కో సబ్ స్టేషన్లోని 10/6 ట్రాన్స్ ఫార్మర్ అగ్నిప్రమాదానికి గురైంది. దీంతో ఈ ప్రాంతంలో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. సమీపంలో వున్న ప్రజలు భయభ్రాంతులకు లోనై ఇళ్ల బయటకు పరుగులు తీసారు.
 
కాగా సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 2 గంటల పాటు తీవ్రంగా శ్రమించిన తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి. ఈ ట్రాన్స్‌ఫార్మర్ 25 ఏళ్ల కిందట ఏర్పాటు చేసిన పాతదిగా అధికారులు తెలిపారు. మంటలు అదుపులోకి వచ్చాక తిరిగి విద్యుత్ సరఫరాను పునరుద్దరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోవిడ్ 19: ఈ ఏడాది డిజిటల్ మహానాడు నిర్వహిద్దాం, చంద్రబాబునాయుడు