Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

5 లక్షల 20 వేల మంది ఇంట‌ర్ విద్యార్థులు పాస్

5 లక్షల 20 వేల మంది ఇంట‌ర్ విద్యార్థులు పాస్
, శుక్రవారం, 23 జులై 2021 (17:27 IST)
ఏపీలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ విడుదల చేశారు. కరోనా విజృంభణతో ఈ ఏడాది పరీక్షలను రద్దు చేసిన ఇంటర్‌ విద్యామండలి మూల్యాంక‌ణం చేసింది.

పదో తరగతి మార్కులకు 30శాతం, ఇంటర్‌ ప్రథమ సంవత్సరానికి 70% వెయిటేజీతో మార్కులను కేటాయించింది. సబ్జెక్టుల వారీగా మార్కులతో పాటు మొత్తానికి సరాసరి గ్రేడ్‌ పాయింట్లు కేటాయించారు. 5లక్షల19వేల797మంది విద్యార్థులు ఇంటర్ పాస్ అయ్యారు.

విద్యార్థుల ఆరోగ్య భద్రత,తల్లిదండ్రుల ఆందోళన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పరీక్షలు రద్దు చేశామ‌ని విద్యాశాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్ చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో మార్కులు ఇస్తున్న నేపథ్యంలో మార్కులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం.

హై పవర్ కమిటీ ఇచ్చిన ఇంటర్ ఫలితాలు పై నివేదికను సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్ళాం. విద్యార్థులు ఫలితాలు పట్ల ఆసక్తి కనబరచకపోతే మరోసారి బెటర్ మెంట్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించామ‌న్నారు మంత్రి. ఈనెల 26 నుంచి ఇంటర్ బోర్డ్ వెబ్ సౌత్ లో ఫలితాలు ఉంటాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల