Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కోడలి వేధింపులు భరించలేక... సామూహిక సూసైడ్.. ఎక్కడ?

కోడలి వేధింపులు భరించలేక... సామూహిక సూసైడ్.. ఎక్కడ?
, శుక్రవారం, 23 ఆగస్టు 2019 (12:24 IST)
కోడలి వేధింపులు భరించలేని ఆ వృద్ధ దంపతులు తమ కుమారుడుతో కలిసి సామూహికంగా ఆత్మహత్య చేసుకున్నారు. ఇందుకోసం వారు పురుగుల మందు సేవించారు. ఆత్మహత్యకు ముందు తమ ఇంటి పశువుల కాపరికి ఇవ్వాల్సిన రూ.200ను కూడా స్టాంపు పత్రంలో రాసి చనిపోయారు. ఈ విషాదకర సంఘటన కృష్ణా జిల్లా కైకలూరు మండలం తామరకొల్లుశివారు అయోధ్యపట్నం గ్రామంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, అయోధ్యపట్నం గ్రామానికి చెందిన వెలగల బలరామకృష్ణా రెడ్డి (60), భార్య సుబ్బలక్ష్మి (51) అనే దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు. కుమారుడు పేరు గంగాధర్‌ రెడ్డి(30). ఇద్దరు కుమార్తెలు మాధవి, మాలతి. వీరిద్దరికీ పెళ్లి చేసి అత్తారింటికి పంపించారు. గంగాధర్ మాత్రం సింగపూర్‌లో ఉద్యోగం చేసుకుంటూ ఉన్నతస్థితికి చేరుకున్నాడు. 
 
ఈ క్రమంలో గత యేడాది ఆగస్టు 31వ తేదీన వెస్ట్ గోదావరి జిల్లా పెనుగొండ మండలం వలేటిపాడు గ్రామానికి చెందిన రాజేశ్వరితో గంగాధరంకు వివాహం జరిపించారు. వివాహం జరిగిన కొద్దిరోజులకే కొడుకు, కోడలకు మధ్య కలహాలు ప్రారంభమయ్యాయి. గొడవలు జరుగుతున్నప్పటికీ విదేశాల్లో ఉద్యోగానికి సెలవులు అయిపోయాయని గంగాధర్‌రెడ్డి వెళ్ళాడు. ఈనెల 31వ తేదీన పెళ్ళిరోజును పురస్కరించుకుని పదిరోజుల క్రితం స్వగ్రామానికి వచ్చాడు.
 
ఈ క్రమంలో ఈ నెల 21వ తేదీన బాలకృష్ణారెడ్డి, గంగాధర్ రెడ్డిలు కోడలిని ఇంటికి తీసుకొచ్చేందుకు వలేటిపాడు గ్రామానికి వెళ్లారు. అక్కడ పెద్దల సమక్షంలో ఏ వివాదం జరిగిందో తెలియదు కాని బల రామకృష్ణా రెడ్డి సాయంత్రానికి ఇంటికి చేరుకున్నారు. గురువారం ఉదయం బలరామకృష్ణా రెడ్డి కొడుకుతో కలిసి కైకలూరు వెళ్ళి కొన్ని పనులను ముగించుకున్నారు. పురుగుమందు డబ్బా, రెండు కొత్త నేలచాపలను కొనుగోలు చేసుకున్నారు. మధ్యాహ్న సమయంలో పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.
 
ఈ ముగ్గురు ఆత్మహత్యకు ముందు... స్టాంపు పత్రాలపై తమ కోడలి వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్టు వెల్లడించారు. తమకున్న ఆస్తి తన కుమార్తెలకు అందాలని అందులో పేర్కొన్నారు. అలాగే, ఎకరం 60 సెంట్ల చేపల చెరువు, బంగారు ఆభరణాలపై తీసుకున్నరుణాలు, ఇంటి వద్ద పశువుల కాపరికి ఇవ్వాల్సి రూ.200ను సైతం సూసైడ్‌నోట్‌లో వివరంగా రాశారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి కోడలి వద్ద జరుపుతున్నారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కృష్ణ జన్మాష్టమి వడేుకల్లో అపశృతి.. నలుగురు భక్తులు మృతి