Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో అపశృతి.. నలుగురు భక్తులు మృతి

Advertiesment
శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో అపశృతి.. నలుగురు భక్తులు మృతి
, శుక్రవారం, 23 ఆగస్టు 2019 (11:55 IST)
శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని ఉత్తర 24 పరగణ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఈ వేడుకల్లో జరిగిన చిన్నపొరపాటు వల్ల నలుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది గాయపడ్డారు. 
 
ఈ జిల్లాలోని కచువాలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను పెద్దఎత్తున నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకలు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో దేవాలయం ప్రహరీ గోడ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు భక్తులు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. 
 
ఈ ప్రమాద ఘటనపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ. లక్ష, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50 వేలు పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు మమత ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విజయసాయిపై పీఎంవో సీరియస్... ఢిల్లీలికి పిలిచిమరీ చీవాట్లు