Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నీ వైపుకు నేనొస్తే.. నువ్వేమో ఇలా అంటున్నావే..? శ్రీకృష్ణుడు

నీ వైపుకు నేనొస్తే.. నువ్వేమో ఇలా అంటున్నావే..? శ్రీకృష్ణుడు
, గురువారం, 22 ఆగస్టు 2019 (13:24 IST)
భగవద్గీత రెండో అధ్యాయంలో శ్రీకృష్ణుడి బోధ ప్రారంభమవుతుంది. అర్జునుడి సందేశాలకు, బాధలకు, నిరాశా నిస్పృహలకు సమాధానంగా కృష్ణ పరమాత్మ గీతను ప్రబోధిస్తాడు. 
 
క్లైబ్యం మా స్మగమఃపార్థ నైతత్త్వయ్యుపద్యతే 
క్షుద్రం హృదయదౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప!
 
వివేకానందుడు తన ఉపన్యాసాల్లో ఈ శ్లోకాన్ని తరచూ ఉంటంకించేవాడు. అర్జునా! "ఏం ఆలోచిస్తున్నావు? ఏం మాట్లాడుతున్నావు? నీకోసం రథం నడపడానికి సిద్ధపడ్డాను. దుర్యోధనుడు స్వయంగా వచ్చి నన్ను సాయం అడిగితే వాడికి సైనికుల ఆశచూపి, నీ పక్కకు వచ్చా! అధర్మం పక్కన ఉండటం ఇష్టం లేక నీ వైపు వచ్చా! ఇప్పుడు నువ్వేమో యుద్ధం చేయనంటున్నావు.
 
పాపాత్ములను చంపితే పాపమని ఏ పుస్తకాల్లో చదివావు? ఒక క్షత్రియుడు మాట్లాడే మాటలేనా ఇవి? క్షత్రయుడు ఉన్నదే రాజ్య రక్షణ కోసం! నీవు ధర్మంలో ఆనందం పొందు. అంతేకాని లేనిదాన్ని తెచ్చిపెట్టుకోకు! నీ హృదయానికి అది దౌర్బల్యం. 
 
దాన్ని విడిచిపెట్టు. శత్రువులను తపింప చేయాల్సిన సమయంలో చేతులు ముడుచుకుని కూర్చోవడం సరికాదు" అని అర్థం. ధర్మాన్ని రక్షించడం కోసం భగవద్గీత తప్ప, శుభాలు జరగడానికి, శ్మశానంలో పాడటానికి కాదు. భగవద్గీతకు సద్గతులకు సంబంధం లేదు. అది గుర్తు పెట్టుకుందాం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కృష్ణాష్టమి పూజా విధానం... పఠించాల్సిన మంత్రాలు