నవ్యాంధ్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి తన మంత్రివర్గ సహచరుల జాబితాను ప్రకటించారు. ఆ జాబితాలో మొత్తం 25మందికి చోటు కల్పించారు. వీరిలో ఐదుగురు ఉప ముఖ్యమంత్రులుగా ఉండనున్నారు. మిగిలిన 20 మంది మంత్రులుగా పని చేస్తారు. తాజా సమాచారం మేరకు మంత్రుల పేర్లను పరిశీలిస్తే,
శుక్రవారం సాయంత్రం ఫోన్లు వెళ్లిన మంత్రుల పేర్ల వివరాలను పరిశీలిస్తే, ధర్మాన కృష్ణదాస్ (నరసన్నపేట), పుష్పశ్రీవాణి (కురుపాం), కురసా కన్నబాబు (కాకినాడ రూరల్), అవంతి శ్రీనివాస్ (భీమిలి), బోత్స సత్యనారాయణ (చీపురుపల్లి), పిల్లి సుభాష్ చంద్రబోస్ (ఎమ్మెల్సీ), పినెపె విశ్వరూప్ (అమలాపురం), ఆళ్ళ నాని (ఏలూరు), బాలినేని శ్రీనివాస్ రెడ్డి (ఒంగోలు), తానేటి వనిత (కొవ్వూరు), కొడాలి నాని (గుడివాడ), పేర్ని నాని (మచిలీపట్నం), చెరుకువాడ శ్రీరంగనాథ రాజు (అచంట), వెల్లంపల్లి శ్రీనివాస్ (విజయవాడ వెస్ట్), మేకతోటి సుచరిత (ప్రత్తిపాడు)లు ఉన్నారు.