Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వినాయ‌క విగ్ర‌హాల ఏర్పాటుపై నిగ్ర‌హం కోల్పోతున్న నేత‌లు

Advertiesment
vinayaka chavithi
విజయవాడ , మంగళవారం, 7 సెప్టెంబరు 2021 (09:59 IST)
ఏపీ లో వినాయ‌క చ‌వితి వివాదాస్ప‌దంగా మారింది. బ‌హిరంగ ప్ర‌దేశాల్లో వినాయ‌క విగ్ర‌హాలు పెట్టొద్ద‌ని ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌క‌టించ‌డంతో, ఇపుడు ప్ర‌తిప‌క్షాల‌కు ఇది పెద్ద ఆయుధంలా మారింది. జ‌గ‌న్ హిందూ వ్య‌తిరేక నిర్ణ‌యాలు తీసుకుంటున్నార‌ని బి.జె.పి., టిడిపి, జ‌న‌సేన నేత‌లు మండిప‌డుతున్నారు.

బిజేపీ నేత రాష్ట్ర ప్రధానకార్యదర్శి యస్.విష్ణువర్ధన్ రెడ్డి ఒక‌డుగు ముందుకేసి, వినాయ‌క విగ్ర‌హాలు పెట్టి తీరుతామ‌ని, అలా విగ్ర‌హం పెట్టిన వారికి బీజేపీ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని పేర్కొంటున్నారు. దీనితో చ‌వితినాడు వీధిపోరాటాలు ఆరంభం అవుతాయ‌ని ఆందోళ‌న వ్య‌క్తం అవుతోంది. 
 
 
బిజెపి రాష్ట్ర ప్రధానకార్యదర్శి. నెహ్రూ యువకేంద్ర నేషనల్ వైస్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ,  దేవాదాయ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ బీజేపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజుపై వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేట‌న్నారు. రాష్ట్రంలో మతాలను రెచ్చగొడుతూ , ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తుంది మీరు, మీ పార్టీ మాత్రమే అని వైసీపీకి చుర‌క‌లు వేశారు.
 
రాష్ట్రంలో మంత్రి వెల్లంపల్లికి దమ్ముంటే, ఒక వినాయక మండపం దగ్గరికి వెళ్లి యువకులకు విగ్రహం పెట్టవద్దని చెప్పగలరా? అని ప్ర‌శ్నించారు. ఒక్కో మతానికి సంబంధించిన పండుగలకు ఒక్కో రకమైన అదేశాలిస్తూ, మతాల మధ్యన చిచ్చు పెడుతున్నార‌ని, ఇదంతా చేస్తోంది జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వమే అన్నారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా వినాయక మండపాలు పెట్టుకోవటానికి అనుమతులు ఇవ్వమని అడిగితే, మాకు మతాన్ని అంటగట్టి మాట్లాడతారా? అని వెల్లంప‌ల్లిపై విరుచుకుప‌డ్డారు. 
 
వ‌చ్చేది పండుగల కాలం, కాబట్టి, కొంచెం జాగ్రత్తగా ఉండండి, అవసరమైన మేరకు మాత్రమే చర్యలు తీసుకోండి అని కేంద్రం చెబితే, హిందూ ధర్మాన్ని పూర్తిగా అణచివేయాలనే ధోరణితో పాలన సాగిస్తున్న మీరు ఏకంగా మండపాలనే పెట్టుకోవద్దు, ఇళ్ళలోనే పండుగ చేసుకోండి, ఉల్లంఘిస్తే అరెస్టు చేస్తామని అదేశాలివ్వడమే కాకుండా, కేంద్రం ఆదేశాలని అసత్యాలుగా ఎందుకు ప్రచారం చేస్తున్నార‌ని ప్ర‌శ్నించారు.
 
హిందూ ధర్మంపై మీరు చూపిస్తున్న వివక్షను రాష్ట్రంలోని హిందువులంతా గమనిస్తున్నారు. విజ్ఞనాయకుడికే విఘ్నాలు కలిగిస్తున్న మీకు, త్వరలో ఆ వినాయకుడే యావత్ హిందూ సమాజం త‌ర‌ఫున‌ బుద్ధి చెబుతాడ‌న్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పోలీసులు ఎన్‌కౌంటర్ చేస్తారనీ... టీడీపీ కార్యకర్తల ఆత్మహత్యాయత్నం