Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పోలీసులు ఎన్‌కౌంటర్ చేస్తారనీ... టీడీపీ కార్యకర్తల ఆత్మహత్యాయత్నం

Advertiesment
TDP Supporters
, మంగళవారం, 7 సెప్టెంబరు 2021 (09:53 IST)
తెలుగు దేశం పార్టీకి చెందిన ఇద్దరు సానుభూతిపరులు (కార్యకర్తలు) ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పోలీసులు ఎన్‌కౌంటర్ చేస్తారన్న భయంతో వారు ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా లింగసముద్రం మండలం మొగిలిచర్లో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని లింగసముద్రం మండలం మొగిలిచర్లలో ఉన్న 4 సెంట్ల భూమికి సంబంధించి టీడీపీ, వైసీపీ సానుభూతిపరుల మధ్య వివాదం ఏర్పడింది. దీంతో ఇరు వర్గాలు ఈ నెల 4న లింగసముద్రం పోలీసులకు ఫిర్యాదు చేశాయి.
 
కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆదివారం ఇరు వర్గాలను స్టేషన్‌కు పిలిచారు. ఈ క్రమంలో వైసీపీ సానుభూతిపరులకు మద్దతుగా వెళ్లిన కె.కొండలరావు గ్రామానికే చెందిన టీడీపీ నాయకుడు వేముల గోపాల్‌ను దుర్భాషలాడారు. ఇదంతా తన సెల్‌ఫోన్‌లో వీడియో తీసిన పల్లపోతు రత్తయ్య గోపాల్‌కు పంపారు.
 
ఇది చూసిన గోపాల్ ఆదివారం కొండలరావును నిలదీయడంతో వారి మధ్య ఘర్షణ జరిగింది. ఒకానొక సమయంలో ఇద్దరూ తోసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువురికి సర్దిచెప్పి అక్కడి నుంచి పంపించేశారు. అనంతరం 11 మంది టీడీపీ, ఐదుగురు వైసీపీ సానుభూతిపరులపై కేసులు నమోదు చేశారు. 
 
అదే రోజు రాత్రి గోపాల్ సహా మరికొందరిని స్టేషన్‌కు తీసుకెళ్లిన పోలీసులు అర్థరాత్రి గడుస్తున్నా విడుదల చేయకపోవడంతో ఆయనకు మద్దతుగా వెళ్లిన మరికొందరు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు.
 
గోపాల్‌ను తిడుతుండగా రికార్డు చేసి పంపడమే వివాదానికి కారణమని తేల్చిన పోలీసులు ఇందుకు కారణమైన రత్తయ్య, శ్రీకాంత్‌లను స్టేషన్‌కు రావాలని ఆదేశించారు. దీంతో స్టేషన్‌కు వెళ్తే తమను ఎన్‌కౌంటర్ చేయడం ఖాయమని భయపడిన రత్తయ్య, శ్రీకాంత్ కాకర్లపాలెం అడ్డరోడ్డు సమీపంలో ఉన్న డంపింగ్ యార్డు వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
 
అపస్మారక స్థితిలో పడివున్నవారిని గమనించిన స్థానికులు వారిని తొలుత వలేటివారిపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి, ఆ తర్వాత అక్కడి నుంచి కందుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై స్పందించిన డీఎస్పీ శ్రీనివాసులు.. తాము చట్టప్రకారమే ముందుకెళ్తున్నామని, తమ వేధింపుల వల్లే వారు పురుగుల మందు తాగారని ఆరోపించడం సరికాదని అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రపంచవ్యాప్తంగా తెలుగు వికీపీడియా సత్తా