ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నగరి నియోజకవర్గ శాసనసభ సభ్యురాలు, సినీ నటి ఆర్కే. రోజా ఉన్నట్టుండి ఆస్పత్రిపాలయ్యారు. ఆమెకు రెండు మేజర్ ఆపరేషన్లు జరిగాయి. చెన్నై నగరంలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రిలో ఈ ఆపరేషన్లు జరిగాయి. ఈ ఆపరేషన్ల తర్వాత ఆమెను ఐసీయూ నుంచి సాధారణ వార్డుకు సోమవారం తరలించారు.
ఈ క్రమంలో మరో రెండువారాల పాటు రోజాకు పూర్తి విశ్రాంతి అవసరమని వైద్యులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రోజా ఆరోగ్య విషయమై ఆమె భర్త సెల్వమణి ఆడియో టేప్ విడుదల చేశారు.
ఈ మేరకు ఇది వరకే ఆమెకు ఈ ఆపరేషన్లు నిర్వహించాల్సి ఉందని, ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు, మార్చిలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. ఆ హడావిడి ముగియడంతో రోజా చెన్నైలోని ప్రైవేట్ ఆస్పత్రిలో శస్త్ర చికిత్సలు చేయించుకున్నారు.
వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, అభిమానులు ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేయడంతో ఆడియో టేప్ రూపంలో ప్రకటన విడుదల చేసినట్లు తెలుస్తోంది. అయితే, రోజా ఏ సర్జరీలు చేయించుకున్నారన్నది తెలియాల్సి ఉంది.