Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టీటీడీ ప్రత్యేక ఆహ్వానితుల నియమ‌కం జీవోని స‌స్పెండ్ చేసిన హైకోర్టు

టీటీడీ ప్రత్యేక ఆహ్వానితుల నియమ‌కం జీవోని స‌స్పెండ్ చేసిన హైకోర్టు
విజయవాడ , బుధవారం, 22 సెప్టెంబరు 2021 (15:50 IST)
ధర్మాన్ని రక్షిస్తే, అది మిమ్మల్ని రక్షిస్తుందన్న విషయాన్ని సీఎం జగన్ గుర్తుంచుకోవాల‌ని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. తిరుపతి విషయంలో హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రభుత్వానికి మొట్టికాయ వేసినట్లైంద‌న్నారు. తిరుపతికి 29 మంది బోర్డు మెంబర్స్, 50 మంది ప్రత్యేక ఆహ్వానితులుగా ప్ర‌భుత్వ‌తం జీవో ఇచ్చింది. అప్పుడే చాలా మంది హిందువుల మనో భావాలు దెబ్బతిన్నాయ‌ని, గతంలో ఇది మంచి పద్దతి కాదు అని తెలుగుదేశం పార్టీ తరపున ప్రభుత్వానికి ఒక లేఖ కూడా రాశామ‌న్నారు అశోక్ బాబు. దేవాదాయ శాఖ చట్టం ప్రకారం తిరుపతి బోర్డులోకి ప్రత్యేక ఆహ్వానితులు అనే పదం ఎక్కడా లేద‌ని, బోర్డు సభ్యులను మాత్రమే నియమించుకోవాల్సి వుంటుంద‌న్నారు. 
 
రాజశేఖర్ రెడ్డి హయాం నుంచే తిరుపతికి నష్టం కలుగుతోంద‌ని, రాజశేఖర్ రెడ్డి ఆనాడు ప్రత్యేక సభ్యులుగా కొందరిని నియమించార‌న్నారు. రాజశేఖర్ రెడ్డి స్నేహితుడు తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, తుడా ఛైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలకు ప్రత్యేక స్థానం కల్పించడానికి ప్రభుత్వం ప్రత్యేక సభ్యులుగా నియమించార‌ని, అనంతరం రోశయ్యను కూడా ప్రత్యేక సభ్యులుగా చేర్చార‌ని తెలిపారు. బోర్డు మెంబర్ కాకుండా టీటీడీ ఈవో, దేవాదాయ శాఖ  కమిషనర్, తిరుపతి ఎమ్మెల్యే, తుడా ఛైర్మన్ పివి ఆర్ ప్రసాద్ సలహాదారుడిగా పెట్టుకున్నార‌ని, చట్టంలో లేకపోయినా 50 మంది సలహాదారులను పెట్టార‌ని అన్నారు. టీటీడీ విషయంలో హిందువుల మనోభావాలు దెబ్బతినేలా జగన్ వ్యవహరిస్తున్నార‌ని ఆరోపించారు. జగన్ కు 151 మంది ఎమ్మెల్యేలున్నారనే అహముంద‌ని విమ‌ర్శించారు. 
 
టీటీడీ పాలకమండలి సభ్యుల నియామకంపై ఏపీ హైకోర్టు సీరియస్ అయింద‌ని, ప్రత్యేక ఆహ్వానితులను నియమిస్తూ జారీ చేసిన జీవోలు చేసిన హైకోర్టు సస్పెండ్ చేసింది వివ‌రించారు. బోర్డు మెంబర్లు కూడా ప్రత్యేక పత్రాలు ఇవ్వడంతో సామాన్యులకు దర్శనం గగనం. లడ్డూల, టికెట్ల ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరిచారు. 50 మంది ప్రత్యేక ఆహ్వానితులను నియమించుకోవడమనేది హిందూ ధర్మం ప్రకారం సబబేనా? టీటీడీ ప్రత్యేక ఆహ్వానితుల కోసం జారీచేసిన జీవోను హైకోర్టు సస్పెండ్ చేసే విషయం హర్షదాయకం.టీటీడీ బోర్డు ప్రత్యేక ఆహ్వానిత సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం జీవో చేశారు. ప్రభుత్వ జీవోను తాత్కాలిక నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. టీటీడీ బోర్డు సభ్యుల నియామకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి.  నిబంధనలకు విరుద్ధంగా ప్రత్యేక ఆహ్వానితులను నియమించారని పిటిషనర్ వాదనలు వినిపించడం జరిగింది. సామాన్య భక్తులపై భారం పడుతుందని పిటిషనర్ల తరపు న్యాయవాది వాదించారు. దేవుడి విషయంలో ప్రభుత్వ తీరు మంచిది కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం చేసిన పొరపాట్లు సరిదిద్దుకోవాలని తెలుగుదేశం పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం. ప్రత్యేక సభ్యుల విషయంలో కూడా ఒక మంచి నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నామని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కనెక్ట్ ఆంధ్రా ఐ.ఓ.సి ఎంప్లాయిస్ రూ.25 లక్షల మెడికల్ కిట్స్ వితరణ